• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాలుష్యానికి నేనే...

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

| దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రవాణా రంగమే ప్రధాన కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో 40 శాతం కాలుష్యానికి తానే బాధ్యత వహిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇథనాల్, బయోగ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలని సూచించారు. గోబర్‌ధన్ యోజన కింద 3,000 బయో ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

By - Satya P
Update: 2026-11-19 05:00 GMT

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓపెన్ గా ఉంటారు. ఉన్న విషయాలను ఆయన చెబుతూ ఏదైనా పొరపాటు జరిగింది అనిపిస్తే ఒప్పుకుంటారు. ఆ మధ్యన ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సదస్సుల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది అని కూడా నిండు సభలో నిజాయితీగా అంగీకరించారు. ఇపుడు అదే నితిన్ గడ్కరీ మరో అడుగు ముందుకేసి దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి తానే బాధ్యుడిని అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎందుకంటే దేశంలో 40 శాతం మేర రవాణా రంగమే వాయు కాలుష్యానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి :

ఇదే సందర్భంలో ఆయన మరో మాట అన్నారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన 14వ సీఐఐ బయో ఎనర్జీ సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అత్యాధునిక రహదారుల నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు. దాని ఫలితంగా వాహనాల సంఖ్య పెరిగి పోతోంది అని అది కాస్తా వాయు కాలుష్యానికి దారి తీస్తోంది అన్నారు. అలా తాను రవాణా శాఖ మంత్రిగా దేశంలో నెలకొన్న 40 శాతం వాయు కాలుష్యానికి స్వయంగా బాధ్యత వహిస్తున్నాను ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తన పదవీ కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ విలువ 14 లక్షల కోట్ల రూపాయల నుంచి 22 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని గడ్కరీ చెప్పారు. ఈ విషయంలో జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని ఆయన గుర్తుచేశారు.

అతి పెద్ద చమురు దిగుమతి :

ప్రపంచంలోనే భారత్ ఈ రోజున అతి పెద్ద చమురు దిగుమతిదారుగా ఉందని గడ్కరీ పేర్కొనడం విశేషం. దేశం తన అవసరాల కోసం 87 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుందని అన్నారు. ఈ పరిస్థితి మారాలీ అంటే దిగుమతులను తగ్గించాలని దాని వల్ల కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చునని అన్నారు. అలాగే ఇథనాల్, బయోగ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం అనివార్యమని గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇక మరో వైపు చూస్తే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.50 లక్షల ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం కేవలం ఏడు వేలు మాత్రమే ఉందని గడ్కరీ చెప్పారు. అదే విధంగా వ్యవసాయ వ్యర్థాలను కాల్చి వేయకుండా వాటిని బయో ఎనర్జీ గా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, అందుకే కేంద్రం గోబర్‌ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 3,000 బయో ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.

Tags:    
  • nitingadkari 
  • airpollution 
  • indiapollution 

Similar News

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

Copyright @2026

Powered by Blink CMS