• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేవంత్ రెడ్డి టీపీసీసీ...

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఖాయమా?

By - Tupaki Desk
Update: 2020-06-09 09:50 GMT
తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? దూకుడుగా టీఆర్ఎస్ ను ఎదుర్కొంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈ కీలక పదవి దక్కబోతోందా? అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ మేరకు ప్రచారం జోరందుకుంది.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలాకాలంగా టీపీసీసీ పదవి అంశాన్ని పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వం... ప్రస్తుతం కేటీఆర్, కేసీఆర్ లపై దూకుడుగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.  

తెలంగాణలో టీపీసీసీ పదవిని కొత్త వారికి ఇచ్చే విషయంలో మరింత ఆలస్యం చేయొద్దనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ రేసులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముందున్నారనే ప్రచారం సాగుతోంది.

అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి రేసులో ఉండటాన్ని కాంగ్రెస్‌లోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో, రాజకీయాల్లో తమకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం సరికాదనే భావనలో వారంతా ఏకమైనట్లు సమాచారం. కొందరు నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి ఏకంగా రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్ లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నట్టు సమాచారం.

 కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఓ ముఖ్యనేత రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పగ్గాలు ఇస్తే బాగుంటుందని హైకమాండ్‌కు చెప్పారని... ఆయన సూచన మేరకు రేవంత్ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు.  మరి సీనియర్లు అంతా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ దక్కుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.
Tags:    
  • Revanth Reddy 
  • TPCC Chief 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

Copyright @2026

Powered by Blink CMS