అంబానీ 5జీ ప్రకటన చేశాక.. తగ్గిన రిలయన్స్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా?

Update: 2020-07-16 05:00 GMT
వచ్చే ఏడాదికి 5జీ సేవల్ని దేశానికి అందిస్తాం. మా కంపెనీలో దగ్గర దగ్గర రూ.33వేల కోట్లతో వాటాను గూగుల్ కొననుంది. రానున్న రోజుల్లో మరిన్ని సేవల్ని అందించనున్నాం.. ఇలా ఒకేరోజు బోలెడన్ని స్వీట్ న్యూస్ లు చెప్పి.. తమ మదపరుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసిన వేళ.. రిలయన్స్ షేరు ధర పరిస్థితి ఏమిటంటే.. రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్లటం ఖాయమని భావిస్తారు.

వాస్తవంలో జరిగింది తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. జియో ప్లాట్ ఫామ్స్ లో 7.7 శాతం వాటాకు ఏకంగా రూ.33,737 కోట్లు చెల్లించేందుకు గూగుల్ ఓకే చెప్పటం తెలిసిందే. వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గూగుల్ ను తాము ఆహ్వానిస్తామని జియో చెప్పుకొచ్చింది. మరి.. ఇలాంటి భారీ ప్రకటన వేళ.. రిలయన్స్ షేర్ ధర భారీగా పెరగాల్సి ఉంది. కానీ.. బుధవారం మాత్రం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

ఇన్ని కీలక ప్రకటన వేళ.. రిలయన్సు షేరు ధర మరింతగా దూసుకెళ్లాల్సిందే. కానీ.. ఇప్పటికే నమోదైన గరిష్ఠ ధర రూ.1978.50 నుంచి తగ్గిపోయింది. కారణం.. లాభాల్ని స్వీకరించేందుకు మదుపర్లు ప్రయత్నించటంతో.. షేర్ విలువ తగ్గింది. దీంతో 3.71 శాతం నష్టపోయి బుధవారం క్లోజింగ్ సమయానికి రూ.1845.60 దగ్గర స్థిరపడటం ఆసక్తికరంగా మారింది.

తాజా పరిణామాల నేపథ్యంలో సంస్థ మార్కెట్ విలువలో రూ.45,014.51 కోట్లకు తగ్గినట్లుగా అంచనా వేశారు. దీంతో.. ఇప్పుడీ కంపెనీ విలువ రూ.11,70,00 కోట్లుగా నిలిచింది. అయితే.. ఇలాంటి హెచ్చుతగ్గులు కామనే అయినా.. ఇన్ని సంచలన ప్రకటనలు చేసిన వేళలో.. మరింతగా దూసుకెళ్లాల్సిన షేరు ధర ఎందుకు తగ్గిందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News