కరోనా కాదు.. వాళ్లకు ఎలుకల పీడ..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనాతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం ఎలుకల బాధ ఎక్కువైందట. దేశంలో ఎలుకల సంఖ్య ఎక్కువ కావడంతో.. రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని ఎలుకలు తాకిడి ఎక్కువైంది. అక్కడ ఎలుకలు దండయాత్ర చేసినట్టుగా విజృంభించినట్టు ప్రజలు అంటున్నారు.
ఎలుకలను చంపేందుకు సాధారణంగా బ్రోమాడియోలోన్ అనే విషాన్ని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ విషం మనదేశంలో అందుబాటులో ఉంది. దీంతో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం. 5 వేల లీటర్ల పాయిజన్ కొనుగోలు కోసం ఆర్డర్ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం 3 వేల ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది.
నిజానికి ఈ మందు ఎంతో విషపూరితమైనది. ఈ మందును కొనుగోలు చేసేందుకు అక్కడి పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అందుకు కారణం ఈ విషపూరితమైన మందు వినియోగిస్తే.. మిగిలిన జీవులు కూడా చనిపోయే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు ఆస్ట్రేలియాలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఎలుకలను ఎలాగైనా నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ నుంచి ఎలుకల మందు కొనుగోలు చేసేందుకు అక్కడి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది.