ఏపీలో బ్రేక్.. ఆగిన రేషన్ డోల్ డెలివరీ

Update: 2021-04-01 18:09 GMT
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ ఆగిపోయింది.  గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.  వాహన డ్రైవర్లు ఇష్టానుసారం కోతలు పెట్టడంపై నిరసన తెలుపుతూ రేషన్ పంపిణీని ఆపేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి డోర్ డెలవరీ రేషన్ ను చేపట్టింది. నిరుద్యోగులకు ఆటోలను సబ్సిడీపై అందించి రేషన్ అందించాలంది. అయితే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఈ వాహనాలు అందించింది.ఇప్పుడు ఆ బ్యాంకులు ఇష్టానుసారం ఈఎంఐలు కట్ చేస్తున్నాయని వాహనదారులు ఆందోళన చేపట్టారు. వాయిదాల రూపంలో నెలకు రూ.3వేలు కట్ చేయాల్సి ఉన్నా అంతకంటే ఎక్కువగా కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరికీ రూ.9వేలు కూడా కట్ చేశారని వాహనాల డ్రైవర్లు వాపోతున్నారు. ఇలా అయితే తమకేం మిగులుతుందని ప్రశ్నిస్తున్నారు. అందుకే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రేషన్ పంపిణీ చేయమని తీర్మానించారు.రేషన్ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేయడంతో ఇప్పుడు లబ్ధిదారులకు రేషన్ అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:    

Similar News