టీకా వేసుకున్నా చనిపోతున్నారు ... అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా మళ్లీ విమర్శలు !

Update: 2021-05-31 04:40 GMT
వైద్యులు ,అల్లోపతి మందుల పై ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి మధ్య డైరెక్ట్ వార్ జరుగుతోంది. ఓ వైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాందేవ్ బాబా పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే , మరోవైపు    రాందేవ్ బాబా మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా  మరోమారు రాందేవ్ బాబా అలాంటి విమర్శలే చేశారు. అల్లోపతితో పోలుస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయుర్వేద వైద్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారు వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా కొందరు మరణిస్తున్నారని , అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు చేశారు.

ఇంగ్లిష్ వైద్యం 100 శాతం పనిచేయదనడానికి ఇది నిదర్శనమన్నారు. తాను కొన్ని దశాబ్దాలుగా యోగాను అభ్యసిస్తున్నానని, ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్న రాందేవ్ బాబా తనకు టీకాలతో పనిలేదన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని విదేశీయులు కూడా అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తుందని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్‌ తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 100 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విధానంతో పోల్చుతూ... కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారని రాందేవ్ బాబా తీవ్రంగా మండిపడ్డారు.

అయితే , వ్యాక్సిన్ గురించి రాందేవ్ బాబు చెప్పటం ఏముంది..  నూటికి నూరు శాతం వ్యాక్సిన్ సామర్థ్యం లేదని, ప్రపంచంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏ టీకా కూడా కరోనా సోకకుండా అడ్డుకోలేదని, అయితే , ఇమ్యునిటి పెరగటంతో పాటు కోవిడ్ నుంచి కొంతమేర రక్షణ కలిగించే సామర్థ్యం మాత్రమే ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ తరుణంలో బాబా రాందేవ్ మళ్లీ వ్యాక్సిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఏమైనా తాను నమ్మిన ఆయుర్వేదాన్ని గొప్పదిగా అభివర్ణించటాన్ని తప్పు పట్టలేం కానీ , ఆల్లోపతిని విమర్శించటం తప్పుగా చెప్పక తప్పదు. ఆల్లోపతి.. ఆయుర్వేదం రెండు ప్రాణాల్ని రక్షించేవే. రెండింటిని శాస్త్రీయంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల మానవుల మనుగడకి మేలు చేయచ్చు. కాగా రాందేవ్ బాబా 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆయనపై వెయ్యి కోట్ల దావా వేస్తామని, ఉత్తరాఖండ్ ఐఎంఏ నోటీసు పంపగా.. ఢిల్లీలోని ఈ సంస్థ ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. అయితే తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని రామ్ దేవ్ బాబా ఛాలెంజ్ విసిరారు.


Tags:    

Similar News