షాకింగ్ న్యూస్... వైసీపీలో చేరిన చంద్రబాబు!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు’... ఇలాంటి వార్తో.. ట్వీటో చదివితే ఏమనుకుంటారు. షాకవ్వరా..? అవును.. నిజంగానే షాక్ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. కొద్దికాలంగా చంద్రబాబును ఏసుకుంటున్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబును కంగారుపెట్టింది చాలక ఇప్పుడు పోలింగ్ ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్న సమయంలో తన క్రియేటివిటీతో మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబును వైసీపీలో చేరినట్లుగా మార్ఫ్ చేసిన ఫొటో ఒకటి ఆయన ట్విటర్ లో షేర్ చేశారు.
వర్మ తాను పోస్ట్ చేసిన ఫొటోకు ‘వావ్ షాకింగ్ ట్విస్ట్ - వైఎస్సార్ సీపీలో చేరిన సీబీఎన్’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. వర్మ ఈ రోజు సాయంత్రం ఆ ఫొటోను పోస్టు చేయగా.. కేవలం మూడు గంటల్లోనే దానికి సుమారు 4 వేల మంది లైక్ కొట్టారు. సుమారు 500 మంది దాన్ని రీట్వీట్ చేశారు. వర్మ క్రియేటివిటీని మెచ్చుకొంటూ కొందరు కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం వర్మను తిడుతూ కామెంట్లు చేశారు. వర్మ చేసిన ట్వీట్లోని ఫొటో ట్విటర్ నుంచి ఫేస్ బుక్ - వాట్సాప్ వంటి మిగతా మాధ్యమాలకూ పాకి ప్రజల మొబైల్ ఫోన్లలో చక్కర్లు కొడుతోందిప్పుడు.
ఈ ఫొటోను పోస్ట్ చేయడానికంటే గంట ముందు వర్మ ఇంకో వీడియో షేర్ చేశారు. అందులో ఆయన కేఏ పాల్ పై సెటైర్ వేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం...ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్ చేసి... ‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. వర్మ చేసిన ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Full View