హైదరాబాద్ కి అతిధిగా యశోదాబెన్

ఇక యశోదాబెన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాలలో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది.;

Update: 2025-12-25 22:30 GMT

ఆమె పేరు యశోదాబెన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు అని కూడా చెబుతారు. ఇదిలా ఉంటే యశోదాబెన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిధిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం మరియు ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడుతో పాటు మరో 18 మందికి పైగా బంధువులతో కలసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెబుతున్నారు.

ఆలయాల సందర్శన :

ఇక యశోదాబెన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాలలో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం, అలాగే లాల్ దర్వాజా లోని సింహ వాహిని అమ్మ వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు అని చెబుతున్నారు. ఇక చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు,

బంధువులు అంతా :

ఇదిలా ఉంటే యశోదాబెన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణ గుట్ట దగ్గర ఆర్‌ఎస్‌ఎస్ మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు అని అంటున్నారు. యశోదాబెన్ వారి ఇంటికి అతిధిగా వచ్చారు అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే యశోదాబెన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది.

Tags:    

Similar News