స్టార్‌ డైరక్టర్లే అక్కర్లేదులే -రామ్‌ చరణ్‌

Update: 2015-10-16 07:01 GMT
'బ్రూస్‌ లీ' సినిమా రిలీజ్‌ అయిపోయింది సరే. తదుపరి 'తని ఒరువన్‌' రీమేక్‌ లో నటిస్తున్నాడు చరణ్‌. ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి డైరక్ట్‌ చేయనున్నాడు. అయితే ఆ తరువాత సినిమాను గౌతమ్‌ మీనన్‌ తో చేస్తున్నాడు. ఒక ప్రక్కన పెద్ద పెద్ద స్టార్లందరూ త్రివిక్రమ్‌ - సుకుమార్‌ మరి రాజమౌళి వంటి హేమా హేమీలతో చేయాలని చూస్తుంటే.. చరణ్‌ ఏంటి ఇలా డిఫరెంట్‌ గా వెళుతున్నాడు?

''అబ్బే అస్తమానం స్టార్‌ డైరక్టర్లే కావాలంటే ఎలా? అసలు మన తెలుగు ఇండస్ర్టీలో దర్శకుల కొరత ఉంది.. ఎప్పుడు ఏ దర్శకుడు అందుబాటులో ఉంటారో తెలియదు. అలాంటప్పుడు ఎవరి కథ బాగుంటే వారితో చేయాలి కాని.. నాకు పలానా ఆయనే కావాలి అంటే కష్టం కదా... అందుకే నేను కొత్తవాళ్ళతోనైనా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. సంపత్‌ నందితో చేసినప్పుడు.. అందరూ సెటైర్లు వేశారు. రిజల్టు తెలుసు కదా'' అంటూ రివర్స్‌ లో క్లాస్‌ పీకేశాడు చరణ్‌. కేవలం స్టార్‌ డైరక్టర్లు ఒక్కరే అక్కర్లేదులే అన్నచందంగా మాట్టాడేశాడు.

అయితే చరణ్‌ చెప్పే మాటలు వింటే స్టార్‌ డైరక్టర్లు కాస్త హర్టయ్యే ఛాన్సుంది. కాని కొత్త కొత్త దర్శకులు మాత్రం ఆనందపడుతున్నారు. ఎలాగైనా సరే రామ్‌ చరణ్‌ కు కథ చెప్పి ఓకె చేయించుకుంటే సినిమా పడిపోతుంది అనే భావనలో ఉన్నారు వారు..
Tags:    

Similar News