ఫేక్ న్యూస్: ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు

Update: 2020-08-13 04:30 GMT
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించాడన్న వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. స్వయంగా ప్రముఖ జాతీయ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా ‘ప్రణబ్ ముఖర్జీ’ చనిపోయాడని ట్వీట్ చేయడంతో నిజమే అనుకొని అందరూ దాన్ని షేర్ చేసి వైరల్ చేశారు.

తెలంగాణ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతిగా చాలా మంది తెలంగాణ, ఏపీ నేతలు కూడా ఆయనకు నివాళులర్పించారు.

కాగా ఈ మరణంపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మరణించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి బతికే ఉన్నారని.. వదంతులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా సోషల్ మీడియాలో తన తండ్రి చనిపోయాడని ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని ప్రణబ్ కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. భారతదేశ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారిపోయిందన్నారు.

ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డం కట్టడంతో ఆయనకు ఢిల్లీలో మిలటరీ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వెంటి లేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నారు.

కాగా ప్రణబ్ చనిపోయాడని వార్తను షేర్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్టు నకిలీ వార్తలకు ప్రచారం చేసినందుకు  క్షమాపణలు చెప్పారు. ఈ నకిలీ వార్తల మాయలో పడి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను.. ట్వీట్ చేసే ముందు దాన్ని తిరిగి ధృవీకరించకపోవడం నా వృత్తిపరమైన తప్పు. అందరికీ క్షమాపణలు ..  ప్రణబ్ కుటుంబానికి సారీ చెబుతున్నట్టు సర్దేశాయ్ వివరించారు.
Tags:    

Similar News