మీటింగ్ తక్కువ.. వెయిటింగ్ ఎక్కువ!

Update: 2017-09-21 04:01 GMT
రాజధాని భవన నిర్మాణాల డిజైస్ల విషయంలో తన అనుభవాన్ని రంగరించి.. సూచనలు సలహాలు చెప్పడానికి డైరక్టర్ రాజమౌళి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. బుధవారం నాడు అమరావతినుంచి వెల్లడైన వార్తల ప్రకారం.. మొత్తం మూడు సార్లు రాజమౌళి సీఎంను కలిసినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే.. ఇదంతా ఉత్తిదేనని.. సీఎంతో రాజమౌళి అసలు భేటీ సమయం చాలా తక్కువే అయినప్పటికీ.. సీఎం ను కలవడం కోసం నిరీక్షణలోనే రాజమౌళి అధిక సమయం గడపవలసి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సీఎం ల మధ్య తొలి భేటీ అసలు జరగనే లేదని.. ఆ సమయంలో చంద్రబాబు బిజీగా ఉండడంతో కలవలేదని సమాచారం. దీంతో రాజమౌళి ఇక తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావడంతో.. మంత్రి నారాయణ తానుగా పూనుకుని.. అమరాతి లో కోర్ కేపిటల్ నిర్మించే ప్రాంతాలు గట్రా కొన్ని గంటల పాటూ.. ఆ భూముల వద్దకు ఆయనను తీసుకెళ్లి ఆ తర్వాత మళ్లీ చంద్రబాబుతో భేటీ అయ్యేలా చేశారని అనుకుంటున్నారు.

నిజానికి ఆ భేటీ కూడా మొక్కబడిగానే జరిగింది. సమయంలేక సాయంత్రం కలుద్దాం అని చంద్రబాబు చెప్పడంతో.. డిజైన్లను స్టడీ చేయడం పేరిట సాయంత్రం వరకు కాలం గడిపి అప్పటికి చంద్రబాబును కలిశారని.. మొత్తానికి రాజమౌళికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేస్తున్నట్లుగా మంత్రినారాయణ - సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ ఆయన ఇంటికి వచ్చి కలువగా.. తర్వాత.. ఆయన అమరావతికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం అపాయింట్మెంట్ ప్రకారం కూడా సమయం కేటాయించకపోవడం ఏంటని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News