బడ్జెట్ పై రాహుల్ గాంధీ సెటైర్లు

Update: 2022-02-02 00:30 GMT
పార్లమెంట్ లో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు , నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. కేంద్ర బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

కేంద్రం ప్రవేశపెట్టింది 'శూన్య' బడ్జెట్ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది జీరో సమ్ బడ్జెట్ అన్నారు. వేతన జీవులు, మధ్య తరగతి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, రైతులు వంటి వారికోసం ఈ బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. చిన్న తరహా పరిశ్రమల రంగానికి కూడా దీనివల్ల ప్రయోజనం లేదన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభకు సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రజలకు స్నేహపూర్వకమైనది.. ప్రగతిశఈలమైనదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రశంసించారు. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు మరింత అభివృద్ధి మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది అని తెలిపారు.

కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం, మాటల గారడీతో కూడుకొని ఉందన్నారు. కేంద్రప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ సామాన్యులకు నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు.

బడ్జెట్ మసిపూసి మారేడుకాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇది అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని కేసీఆర్ ధ్వజమెత్తారు.దేశ చేనేత రంగానికి కూడా ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని కేసీఆర్ విమర్శించారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులకు తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
Tags:    

Similar News