రాహుల్ మొహంపై జెండా విసిరేశాడు... యూపీలో మరో భద్రత లోపం
పంజాబ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే టాక్ ఓ వైపు వినిపిస్తుండగా ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్లో ప్రధాని మోడీ కాన్వాయ్ అడ్డుకున్న ఘటన సంచలన రేపగా మళ్లీ పంజాబ్లోనే మరోసారి భద్రత లోపం బయటపడింది. తాజాగా ఈ షాక్‌కు లోనైంది కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆదివారం లుధియానా వెళ్లారు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు అభివాదం చేసేందుకు రాహుల్ కారు అద్దం దించారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై జెండా విసరగా రాహుల్ గాంధీ ముఖానికి తగిలినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనతో రాహుల్ గాంధీ కారు అద్ధం మూసేసి అక్కడి నుంచి మందుకు కదిలి వెళ్లారని సమాచారం.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భద్రత లోపాల ఘటన ఒకింత ఆలస్యంగా వెలుగులోకి రాగా, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. జెండా విసిన వ్యక్తి కశ్మీర్కు చెందిన ఎన్ఎస్యూఐ కార్యకర్తగా అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా, వీవీఐపీల సెక్యూరిటీలో భద్రతా లోపం వెలుగులోకి రావడం, అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తాజాగా రాహుల్ గాంధీ ఈ భద్రత లోపాల విషయంలో సమస్యలు ఎదుర్కోవడం కలకలంగా మారింది.