భార‌త్ ట్రంప్ ఎవ‌రో తేలిపోయింది

Update: 2017-02-09 13:09 GMT
కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ త‌న రాజ‌కీయ‌ నైపుణ్యానికి ప‌దును పెడుతున్నారు. రొటీన్ స్పీచ్ కు భిన్నంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఖుర్జాలో రాహుల్ ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొన్న సంద‌ర్భంగా నోట్ల ర‌ద్దు అంశంపై  రాహుల్ మాట్లాడుతూ "అమెరికాకు ఈ మ‌ధ్యే ఓ డొనాల్డ్ ట్రంప్ దొరికారు.. కానీ ఇండియాకు మాత్రం న‌రేంద్ర మోదీ రూపంలో రెండున్న‌రేళ్ల కింద‌టే ట్రంప్ దొరికారు. ఎందుకంటే పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఇబ్బంది ప‌డ్డారు" అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు.  దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల రైతులు విత్త‌నాలు - పురుగుల మందులు కొన‌లేక‌పోయార‌ని రాహుల్ చెప్పారు. ఇక నోట్ల‌ను మార్చుకునేందుకు క్యూల‌లో నిల‌బ‌డి చాలా మంది చ‌నిపోయార‌ని, అలాంటి వారిని కేంద్రం అస‌లు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

మ‌రోవైపు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌ పై రాజ్యసభలో ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌లు రెండో రోజు సైతం ర‌గ‌డ‌కు దారితీశాయి. రెయిన్‌ కోట్‌ తో స్నానం చేయ‌డం మోదీకి తెలుసు అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అనేక స్కామ్‌ లు చేసినా, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌ కు మాత్రం మ‌చ్చ‌ప‌డలేద‌ని ప్ర‌ధాని మోదీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల ప్ర‌ధాని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఇవాళ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సౌమ్యుడైన మ‌న్మోహ‌న్ సింగ్‌ ను కామెంట్ చేయ‌డం అవ‌మాన‌క‌రంగా ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శ‌ర్మ విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌వ‌ర్త‌న తీరు స‌రిగా లేద‌న్నారు. మరోవైపు అన్నాడీఎంకే ఎంపీలు కూడా స‌భ‌లో నిర‌స‌న గ‌ళం వినిపించారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ వేగ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ - అన్నాడీఎంకే ఎంపీలు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో స‌భ‌ను వాయిదా వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News