బాబుకు రాహుల్ బంపరాఫర్ !
2014. ఏపీలో కాంగ్రెస్ ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది?... రాష్ట్రాన్ని విభజించడం వల్ల! మరి తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేదు... రాష్ట్రాన్ని విభజించడం వల్లే.
అదేంటి రెండింటికి ఒకే కారణమా? అవును. రాష్ట్రాన్ని విభజించేలా చేసిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ సీఎం పదవి ఇచ్చారు. అదే ఆంధ్రలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఏపీ ప్రజలు భావించారు... రివెంజ్ తీర్చుకున్నారు. బీజేపీతో విడిపోయాక మెల్లగా కాంగ్రెస్తో దోస్తీ చేశాడు చంద్రబాబు. ఏదో ఒక సపోర్టు లేకపోతే బాబు బండి ముందుకు నడవదు. ఇది జనం ఫీలింగ్ కాదు - బాబు ఫీలింగ్. అందుకే ముందుగా ఫీలర్లు వదిలి తన సైన్యం కొంతవరకు మానసికంగా సిద్ధం అయ్యేలా చేసి... అందుకే బీజేపీని అడ్డం పెట్టి - ప్రత్యేక హోదాను వాడుకుని మొత్తానికి హ్యాండులో హ్యాండేశాడు చంద్రబాబు.
తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశానికి ఊపిరి పోయడానికి కాంగ్రెస్ ను వాడుకున్నాడు చంద్రబాబు. పొత్తు పుణ్యమా అని కొన్ని సీట్లు అయినా దక్కించుకుని పార్టీని బతికించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అయితే ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ విభజన కష్టాలు ఏపీ ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అందుకే వారి కోపం కాంగ్రెస్ పై తగ్గలేదు. పైగా కాంగ్రెస్ లో పెద్ద తలకాయలు దాదాపు లేవక్కడ. దీంతో కేడర్ కూడా పెద్ద గా లేదు. అందువల్ల తెలంగాణలో చేసిన పొత్తు ఆంధ్రలో పనికిరాదేమో అన్న అనుమానం చంద్రబాబులో ఉంది. అందుకే మీమాంసలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజా కూటమికి వ్యతిరేకంగా వస్తే ఎలాగూ బాబు కాంగ్రెస్ తో ఏపీలో పొత్తు పెట్టుకోడు. కానీ ఫలితాలు అనుకూలంగా వస్తే మాత్రం ఆలోచించాలని అనుకుంటున్నారట చంద్రబాబు. బాబు డైలమాను అర్థం చేసుకున్న రాహుల్ ఏంటి మీ సంశయం అని విచారించారట. నాకు టైం కావాలని బాబు అడగడంతో మీ ఇష్టం... ఏపీలో ఏ ప్రపోజల్ చెప్పినా ఓకే అంటూ రాహల్ చంద్రబాబుకు బంపరాఫర్ ఇచ్చారని చెబుతున్నారు.
చంద్రబాబు టైం అడిగింది ఆలోచించడానికి కాదు, ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయిద్దాం అని... ఏ మాటను ఎలా అయినా మార్చగలిగిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు అనుసరించి నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. బాబు రూలు ఒకటే... ప్రపోజల్ ఏదైనా తనకు అనుకూలంగా ఉండాలి. పొత్తు ధర్మాలు అవీ ఇవీ ఏం చెల్లవు. కాకపోతే తన మనసులోని ఈ మాటను మనం అర్థం చేసుకోవాల్సిందే గాని బయటకు చెప్పడు చంద్రబాబు.