చంద్రబాబు పేరు అబద్దాల నాయుడట!
టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ రేంజీలో ఫైరైపోయారు. నేటి ఉదయం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రఘువీరా... చంద్రబాబును పెదబాబుగా, లోకేశ్ ను చినబాబుగా అభివర్ణిస్తూ సెటైర్ల వర్షం కురిపించారు. మూడేళ్ల కాలంలో టీడీపీ సర్కారు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని తేల్చేసిన రఘువీరా... మూడేళ్ల పాటు దోపిడీ పాలనను సాగించిన చంద్రబాబు... దోపిడీ బాబుగా మారిపోయారని కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. అసలు చంద్రబాబే తన పేరును అబద్ధాల నాయుడిగా మార్చుకున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు.
మీడియా సమావేశంలో రఘువీరా ఇంకా ఏమన్నారంటే... ‘టీడీపీ - బీజేపీ మూడేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. సీఎం చంద్రబాబు తన పేరును అబద్ధాల నాయుడుగా మార్చుకున్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. అవినీతి - దోపిడి - అరాచకాల్లో ఏపీ నంబర్ వన్ గా మారింది. పెదబాబు - చినబాబు - టీడీపీ నేతలు కలిసి ఇసుకలో రూ. 29 వేల కోట్లు సంపాదించారు. చంద్రబాబు మూడేళ్ళుగా అన్నం తినడం లేదు ఇసుక తింటున్నారు. సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారు’ అని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
‘భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. తన అవినీతి వల్లే ప్రత్యేక హోదాపై రాజీపడ్డారు.ఏపీలో చినబాబుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. బ్యాంకులకు టీడీపీ నాయకులు వేల కోట్లు ఎగ్గొట్టారు. టీడీపీ ఆర్థిక నేరస్థులను పెంచిపోషిస్తోంది. టీడీపీ నేతలు అధికారలోకి వచ్చిన తరువాత రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. బాబు మీడియా గొంతు నొక్కుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాను అనేక ఇబ్బందులు పెడుతున్నారు’ అని రఘువీరా ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/