కేసీఆర్ ఆ సంతకం పెడితే చంద్రబాబు జైలుకేనట..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరెత్తితే ఇంతెత్తున విరుచుకుపడే ఏపీపీసీసీ ప్రెసిడెంటు రఘువీరారెడ్డి తాజాగా మరోసారి చంద్రబాబునాయుడుపై మండిపడుతున్నారు. చంద్రబాబు భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉందని... అందుకే కేసీఆర్ ఏం చేసినా చంద్రబాబు ఏమీ చేయలేక ఊరుకుంటున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పూర్తిగా కేసీఆర్ దయా దాక్షిణ్యాలపై బయటపడ్డారన్నట్లుగా రఘువీరా మాట్లాడారు. ఇప్పటికీ ఓటుకు నోటు కేసులో ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం చేస్తే, చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనంటూ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో విలేకరులతో మాట్లాడిన రఘువీరా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారని.. కేసులకు భయపడి ఆయన సైలెంటయిపోయారని అన్నారు. కేసులకు భయపడే, తెలంగాణ ప్రాజెక్టులకు బాబు అడ్డు చెప్పడం లేదని దుయ్యబట్టారు. బాబు అసమర్థతను అలుసుగా తీసుకుని తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
కాగా లేవలేనిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అందరూ వదిలేసినా రఘువీరా మాత్రం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టో.. ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టో ఇంకా కాంగ్రెస్ నేతలు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే రఘువీరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ లో వినిపించని పరిస్థితి ఉండేదేమో. అలాకాకుండా ఉండేందుకే రఘువీరా నిత్యం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు స్థాయి వ్యక్తిని విమర్శిస్తే మీడియాలో వస్తుంది కాబట్టి రఘువీరా నిత్యం చంద్రబాబును విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని అంటున్నారు.