రఘువీరాకు జ్ఞానోదయమైందా..?
బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది... అనేకమంది రుషులు - మహర్షులు హిమాలయాల్లో తపస్సులు చేసి భగవత్సాక్షాత్కారం - జ్ఞానోదయం పొందారు. అలాంటి హిమాలయాలకు వెళ్లొచ్చినా కూడా ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి మాత్రం జ్ఞానోదయం కాలేదు. దేశమంతా... కాంగ్రెస్ పార్టీలోని నాయకులంతా కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టం అని తేల్చిసిన టైంలో రఘువీరా మాత్రం 2019 లో ప్రధాని రాహుల్ గాంధీయేనంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో రెండు రోజుల కిందట వరకు హిమాలయాల్లో యాత్ర చేసొచ్చిన రఘువీరా అక్కడ జ్ఞానం సంపాదించుకున్నారా లేదంటే ఉన్న మతిపోయిందా అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
2019లో జరిగే ఎన్నికల్లో ప్రధాని రాహుల్‌గాంధేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అంటున్నారు. ఆదివారం విజయవాడలో కాపులకు రిజర్వేషన్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో మా సత్తా చూపుతామని అన్నారు. టీడీపీలో బీసీ నేతల అభ్యంతరాలపై చంద్రబాబు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ 2019లో ప్రధాని అవుతారనే సరికే సభలో అందరూ చెవులు కొరుక్కోవడం కనిపించింది. రఘువీరాకు ఇంకా ఆశలున్నాయా అని అనుకుంటున్నారు.