సివిల్స్ ఇంట‌ర్వ్యూలో తెలంగాణ స‌ర్కారుపై ప్ర‌శ్న‌!

Update: 2017-06-06 09:33 GMT
దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నా.. సివిల్స్ కున్న ఛ‌రిష్మానే వేరు. సివిల్స్ ను సాధించ‌టం అంటే అదో శిఖ‌ర‌ప్రాయ‌మైన అఛీవ్ మెంట్‌గా భావిస్తారు. క‌ఠిన‌మైన ద‌శ‌ల్ని దాటి.. ఇంట‌ర్వ్యూకు వెళ్లిన వారికి.. ఇంట‌ర్వ్యూ బోర్డు చాలా ప్ర‌శ్న‌లు సంధిస్తుంది. వాటికిచ్చే స‌మాధానం మీద‌నే అంతిమ ఫ‌లితం ఉంటుంది. జ‌వాబు చెప్పే విష‌యంలో ఏ మాత్రం తేడా దొర్లినా జ‌రిగే న‌ష్టం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

తాజాగా సివిల్స్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అందులో 22వ ర్యాంకును సాధించారు ముజామిల్ ఖాన్‌. ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూలో బోర్డు మెంబ‌రు ఒక‌రు అడిగిన ప్ర‌శ్న, ఆస్పిరెంట్ స‌మాధానం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆయ‌న‌కు ఎదురైన ప్ర‌శ్న ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్య‌మం త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్ర‌శ్నించారు.

విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఎదుగుద‌ల క‌చ్ఛితంగా క‌నిపిస్తోందని.. వ్య‌వ‌సాయం.. ఇరిగేష‌న్‌.. విద్యుత్‌.. సంక్షేమ ప‌థ‌కాలు లాంటివి వాటికి కొన్నిఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పారు. కొన్ని వ్య‌తిరేకించాల్సి అంశాలు కూడా ఉన్న‌ట్లుగా చెప్పారు. నిరుద్యోగం ఆరుశాతం ఉంద‌ని.. అది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా ఆయ‌న చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. రాజ‌కీయంగా చూస్తే.. పూర్తి గుత్తాధిప‌త్యం క‌నిపిస్తున్నా.. మొత్తానికి ప్ర‌భుత్వం చాలా బాగా ప‌ని చేస్తున్న‌ట్లుగా చెప్పారు.

అయితే.. స‌రైన ప్ర‌తిప‌క్షం లేకుంటే.. భ‌విష్య‌త్తులో అది ప‌వ‌ర్ లో ఉన్న వారికి గ‌ర్వం ఎక్కువ‌య్యేలా చేస్తుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లుగా చెప్పార‌ట‌. మొత్తానికి.. సివిల్స్ టాప‌ర్ సైతం.. తెలంగాణ‌లో అభివృద్ధి విష‌యంలో మార్పు ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం కేసీఆర్ స‌ర్కారు ప‌ని తీరు ఎంత ప్ర‌భావం చూపుతుంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News