లోకేశ్ ను తరిమికొట్టిన రైతులు, స్థానికులు

Update: 2020-03-04 06:10 GMT
ప్రజా చైతన్య యాత్ర పేరిట మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకేశ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. వారి పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబుకు పరాభవం ఎదురుకాగా విశాఖ పట్టణంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. తాజాగా తండ్రికి దక్కినట్టే కుమారుడు నారా లోకేశ్ కు కూడా పరాభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో పర్యటించారు.

యాత్రలో భాగంగా మునికూడలి వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పురుషోత్తపట్టం పథకం కోసం తమను ఇబ్బంది గా పెట్టారని, ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన చేస్తూ కాటవరం రైతులు నిరసనకు దిగారు. ఈ సమయంలో ఈ మార్గాన లోకేశ్ యాత్ర చేపట్టాడు. మునికూడలికి చేరగానే రైతులు లోకేశ్ తీరును ఎండగట్టారు. ఆ నిర్వాసితులే లోకేశ్ యాత్రను అడ్డుకున్నారు. వారికి మద్దతుగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిలబడ్డారు. ఈ సందర్భంగా ‘పప్పు గో బ్యాక్‌’, ‘జయంతికీ వర్ధంతికీ తేడా తెలియని నారా లోకేష్‌..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

దీనిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు యత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నిరసనతో లోకేశ్ షాకవగా.. హఠత్పరిణామానికి లోకేశ్ బిత్తరపోయి.. అధికార పార్టీపై విమర్శలు చేశారు. గతంలో మాదిరే పులివెందుల గూండాలు దాడి చేశారని యథావిధిగా విమర్శించారు. ఈ విధంగా అడుగడుగున పరాభవం ఎదురవుతుండడంతో తండ్రీకొడుకులు ప్రజా చైతన్య యాత్ర చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది.



Tags:    

Similar News