బాబు - అమరావతి రైతులకు షాకిచ్చిన పురంధేశ్వరి

Update: 2019-12-21 11:03 GMT
ఏపీలో మూడు రాజధానులు కావాలంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతికి భూములు ఇచ్చిన రైతులు పోరుబాట పట్టారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారన్న విమర్శలున్నాయి.. తాజాగా రాజధాని రైతులు ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించుకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరిని కలిశారు. కానీ పురంధేశ్వరి ఈ విషయంలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తుందని చెప్పి పురంధేశ్వరి రాజధాని రైతులకు, చంద్రబాబుకు షాకిచ్చారు. రైతులు భూములు రాజకీయ నాయకులకు ఇవ్వలేదని.. భూములు ప్రభుత్వానికి ఇచ్చారని ఆమె తెలిపారు. టి అధికారంలో ఉన్నవారు మొదట రాజధాని రైతులకు సమాధానం చెప్పాలని పురంధేశ్వరి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏం చెబుతుందో చూసిన తర్వాత బీజేపీ స్పందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం 2500 కోట్ల రూపాయలు నిధులిస్తే చంద్రబాబు వాటితో గ్రాఫిక్స్ చేయించి చూపారని.. చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణానికి బాబు పనిచేయలేదని ఆరోపించారు.
    

Tags:    

Similar News