నిద్ర న‌టించే బాబును లేప‌టం క‌ష్టం

Update: 2018-06-26 09:03 GMT
సినిమాల్లో హిట్ కాంబినేష‌న్లు ఎలానో.. రాజ‌కీయాల్లోనూ కొన్ని కాంబినేష‌న్లు మ‌హా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును త‌ప్పు ప‌ట్టే విష‌యంలోనూ.. విమ‌ర్శ‌ల‌తో క‌డిగిపారేసే విష‌యంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా కానీ.. బీజేపీ నేత‌.. చిన్న‌మ్మ‌గా అంద‌రికి సుప‌రిచితులు.. బాబు స‌తీమ‌ణి సొంత సోద‌రి అయిన పురంధేశ్వ‌రి చేసే విమ‌ర్శ‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.

బాబు పేరు ఎత్తితేనే లోడెడ్ గ‌న్ మాదిరి విరుచుకుప‌డే చిన్న‌మ్మ‌.. తాజాగా మ‌రోసారి బాబుపై తీవ్రంగా మండిప‌డ్డారు. నిద్ర పోతున్న వారిని లేప‌టం వీల‌వుతుంది కానీ.. నిద్ర న‌టించే వారిని లేప‌టం క‌ష్ట‌మ‌న్న ఆమె బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఏపీలో మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న దాడుల‌పై ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌లు అంశాల‌పై మాట్లాడిన చిన్న‌మ్మ ఏమ‌న్నారంటే..

+ నిద్ర‌పోతున్న వారిని లేపొచ్చు. నిద్ర పోతున్న‌ట్లుగా న‌టిస్తున్న చంద్ర‌బాబు వంటి వారిని లేప‌టం మావ‌ల్ల కాదు

+ ఏపీలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగిపోయాయి. అయితే.. వాటిని ప్ర‌భుత్వం అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు.

+ పోల‌వ‌రం ప్రాజెక్టు పైన ఆరోప‌ణ‌లు చేయ‌టం మా ఉద్దేశం కాదు.

+ పోల‌వ‌రం ప్ర‌గ‌తిని చూపేందుకు మీడియాను మేం తీసుకెళ్లాం

+ రూ.1900 కోట్ల పోల‌వ‌రం బిల్లులు ఇంకా కేంద్రానికి చేర‌లేదు. కొత్త డీపీఆర్ ఇస్తే స‌రిపోదు.

+ పోల‌వ‌రం ఏపీకి ఒక వ‌రం. ప్రాజెక్టుకు కేంద్రం కావాల‌నే అడ్డుప‌డుతుంద‌ని ప్ర‌చారం చేయ‌టం దుర్మార్గం.

+ వ‌చ్చే వేస‌వి నాటికి పోల‌వ‌రం పూర్తి చేయ‌ట‌మే కేంద్ర ల‌క్ష్యం

+ నూటికి నూరుశాతం కేంద్రం నిధుల‌తో పోల‌వ‌రం ప్రాజెక్టు క‌డుతున్నారు

+ దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్య‌యాన్ని కేంద్ర‌మే భ‌రిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు బాధ్య‌త మాదేన‌ని గ‌డ్క‌రీ కూడా చెప్పారు.

+ భూసేక‌ర‌ణ వివ‌రాలు ఇస్తేనే నిధులు వ‌స్తాయి. నిర్వాసితుల ప‌రిహారం లోపాల్ని ప‌రిశీలిస్తున్నాం.

+ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్ట‌టానికి త‌గిన కార‌ణం ఉంది. విభ‌జ‌న వేళ‌.. ఏడు మండ‌లాల విష‌యంలో కాంగ్రెస్ వైఖ‌రి కార‌ణంతోనే ఆ పార్టీని విడిచి పెట్టాల్సి వ‌చ్చింది.

+ అవే 7 మండ‌లాల్ని ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ‌లో ఉన్న వాటిని ఏపీలో క‌లిపేలా చేశాం.

+ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల్ని డ్రామాలుగా విమ‌ర్శించ‌టం ఎంత మాత్రం స‌రికాదు

+ ఒక‌వేళ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు డ్రామాలే అయితే.. వేరే పార్టీ వాళ్ల‌ను కేబినెట్లో చేర్చుకున్న దానికేం స‌మాధానం చెబుతారు?

+ రాజీనామాలు చేసి పార్టీ మారిన వారి విష‌యంలో ఇంకా ఎందుకు నిర్ణ‌యం తీసుకోన‌ట్లు?

+ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల్ని.. ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి తీసుకున్నారు. వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. మ‌రి దానిపైన చంద్ర‌బాబు ఎందుకు మాట్లాడ‌రు?

+ సిమెంటు రోడ్లు.. 24 గంట‌ల క‌రెంట్ ఇస్తే వాటిని బాబు త‌మ ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేసుకుంటున్నారు

+ క‌డ‌ప ఉక్కుపై టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. స్టీల్‌ ఫ్లాంట్ నిర్మాణంపై ఎన్నిసార్లు నివేదిక అడిగినా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు.

+ హోదాకు బ‌దులుగా ప్యాకేజీ కావాల‌ని చంద్ర‌బాబే అడిగారు

+ జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ బ‌లంగా ఉంది.

+ జ‌మిలిపై నిర్ణ‌యం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే
Tags:    

Similar News