జగన్ సర్కారుకు కోపమొస్తే.. అక్కడ పోస్టింగ్ వేస్తారా?
ఏదైనా సంచలనం చోటు చేసుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సదరు అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా అంతర్వేది దేవస్థానంలో స్వామివారి రథం దగ్థమైన ఉదంతం ఏపీలో రచ్చగా మారితే.. దాని ఊసే తెలంగాణలో లేని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ఏపీలో మాత్రం జగన్ సర్కారుకు ఈ వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతర్వేది ఎపిసోడ్ నేపథ్యంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. ఒక కొత్త విషయం ఇట్టే అర్థమవుతుంది. ఎవరైనా అధికారి విషయంలో సర్కారు సీరియస్ గా ఉందంటే చాలు.. వారిపై బదిలీ వేటు వేయటం మామూలే అయినా.. ఒకే ప్రాంతానికి వేస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జగన్ ప్రభుత్వంలో కొంతకాలం వెలిగిపోయిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తప్పించటం అప్పట్లో పెద్ద చర్చగా మారటం తలెిసిందే. ఆయన్ను అప్పట్లో గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా బదిలీ వేటు వేశారు. ఎల్వీ లాంటి సీనియర్ అధికారిని అలాంటి పోస్టుకు పంపటమా? అన్న విస్మయం వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అంతర్వేది ఉదంతంలో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయటంలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం.. ఆయన్ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుసల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా వరుస పెట్టి.. పనిష్మెంట్ ఇవ్వాలనుకున్న వారిని బాపట్లకు పంపుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.