భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా భారీ మద్దతు !
రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా అనూహ్య స్థాయిలో మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వంతో ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరపగా, ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో మంగళవారంనాడు భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చారు. ఈ బంద్ కి విపక్షాలన్నీ తమ మద్దతు ప్రకటించాయి. లారీల యజమానులు, పది ప్రధాన కార్మిక సంఘాలు, అనేక ఇతర యూనియన్లు మద్దతు పలకగా, బ్యాంకు యూనియన్లు కూడా తమ గళం కలిపాయి. అటు బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్ లతో పాటు పంజాబ్ నుంచి ఎన్నికైన సన్నీ డియోల్ కూడా మద్దతిచ్చారు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలని వెనక్కి తీసుకోవాలని , దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో వేలాదిమంది రైతులు ఢిల్లీని ముట్టడించారు. ఆ ఆందోళనలు అలాగే కొనసాగుతున్నాయి. రైతులు ప్రకటించిన భారత్ బంద్ కి ఎన్డీయేతర పార్టీలు అయిన కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. విపక్షాలన్నీ బంద్ కు తమ మద్దతు ప్రకటించాయి. లారీల యజమానులు, పది ప్రధాన కార్మిక సంఘాలు, అనేక ఇతర యూనియన్లు మద్దతు పలకగా, బ్యాంకు యూనియన్లు కూడా తమ గళం కలిపాయి. అటు బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్‌లతో పాటు పంజాబ్ నుంచి ఎన్నికైన సన్నీ డియోల్ కూడా మద్దతిచ్చారు.
చట్టాల్ని రద్దు చేయకుంటే ప్రభుత్వం తనకు ఇచ్చిన అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను వాపస్ ఇచ్చేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. పరిస్థితిపై నేడు కేంద్ర వ్యవసాయ, హోం శాఖలు చర్చలు జరపనున్నాయి. రైతులతో మాత్రమే మొదలైన ఈ ఉద్యమం ఇపుడు ఎన్డీయేతర పార్టీలు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో పాటు ఎన్డీయేతర ప్రభుత్వాల మద్దతు కూడగట్టేదాకా చేరుకుంది. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు కూడా బంద్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యలో ఆ రోజు సాధారణ జన జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, రవాణా సేవలు స్తంభించి పోయే అవకాశం ఉంది.