రంగంలోకి దిగిన ప్రియాంక! యోగి సర్కారే టార్గెట్

Update: 2019-07-19 12:25 GMT
యూపీ రాజకీయంలో  కాంగ్రెస్ పార్టీకి కాస్త యాక్టివేట్ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహారాలపై ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారని ఆ పార్టీ నేతలు కొన్నాళ్లుగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఆమె అక్కడ తాజాగా చోటు చేసుకున్న ఒక హింసాత్మక కాండ బాధితులను పరామర్శిచడానికి కదిలారు. వారణాసి సమీపానికి ఆమె వెళ్లగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అలర్ట్ అయ్యింది.

ఆమెను బాధితుల వద్దకు వెళ్లనీయలేదు అధికారులు. ఆమెను పోలిస్ జీప్ ఎక్కించి అక్కడ నుంచి తరలించారు!

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..ఒక గ్రామ పెద్ద తనకు ఎదురు తిరిగిన రైతులందరి మీద తన ప్రైవేట్ సైన్యం చేత కాల్పులు జరిపించాడు. తమ భూమిని అతడు ఆక్రమించాడని ముప్పై ఆరు రైతు కుటుంబాలు ఆయనపై  తిరుగుబాటు చేయగా.. వారిపై తన వారితో కాల్పులు జరిపించాడు ఆ మోతుబరి. ఆ హింసాకాండలో పది మంది రైతులు చనిపోయారు!

ఈ ఘటన సంచలనంగా మారింది. గూండారాజ్ అనే మాటకు పర్యాయంగా నిలుస్తోంది ఈ సంఘటన. దీనిలో బాధితులను పరామర్శించడానికి ప్రియాంక స్వయంగా వెళ్లే ప్రయత్నం చేశారు. వారణాసికి వెళ్లి అక్కడ నుంచి బాధితుల స్థలానికి ఆమె బయల్దేరగా.. మధ్యలోనే అధికారులు అడ్డుకున్నారు.

సంఘటన జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్టుగా, అలాంటి చోటకు వెళ్లకూడదని ప్రియాంకను అడ్డుకున్నట్టుగా యోగి సర్కారు చెబుతోంది! ఆ సంఘటనపై నిందితులపై చర్యలుంటాయని సీఎం యోగి ప్రకటించారు.


Tags:    

Similar News