గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభ కు ఆమెనే.?
చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్ ను ఒడ్డుకు పడేసే ఆయుధం ప్రియుంకాగాంధీనే అన్న నమ్మకం కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే వరుసగా రెండోసారి రాహుల్ నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. పోయినసారి ఉత్తర ప్రదేశ్ ఇన్ చార్జిగా ఉండి ప్రియాంకగాంధీ సైతం ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు రాబట్టలేకపోయారు.
అయితే ఈ భారీ ఓటమితో రాహుల్ గాంధీ కృంగిపోయి అస్త్రసన్యాసం చేయగా.. అదే సమయంలో ప్రియాంకగాంధీ మాత్రం మరింత దూకుడుగా.. వాడివేడి వ్యాఖ్యలతో మోడీషాలను ఢీకొంటున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. రాహుల్ కాడి వదిలేసి పక్కకు తప్పుకోవడం.. అల్పుడిగా ఆలోచిస్తుండడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధీర వనిత ప్రియాంక గాంధీనే దిక్కు అని నేతలు భావిస్తున్నారు. నేతల ఆలోచనలు పసిగట్టిందో ఏమోకానీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు..
పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అధికారం దిశగా నడిపించలేకపోతున్న రాహుల్ గాంధీతోపాటు పార్టీలో ప్రియాంక గాంధీకి సమప్రాధాన్యం ఇవ్వాలని సోనియాగాంధీ తాజాగా నిర్ణయించారని తెలిసింది. అందుకే కూతురు ప్రియాంకను తాజాగా రాజ్యసభ కు పంపాలని నిర్ణయించారు.
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో అధికారంలో ఉంది. ఇందులో రాజ్యసభ నుంచి ప్రియాంకగాంధీని నామినేట్ చేయించేందుకు సోనియా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్లాన్ సిద్దం చేశారని కాంగ్రెస్ ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
గాంధీల కుటుంబం నుంచి రాజ్యసభ లోకి అడుగు పెట్టిన రెండో వ్యక్తి గా ప్రియాంక గాంధీ రికార్డ్ సృష్టించబోతున్నారు. తాత ఫిరోజ్ గాంధీ తర్వాత పెద్దల సభకు వెళుతున్నది ప్రియాంకనే.. నెహ్రూ నుంచి ఇందిరా, సోనియా, రాహుల్ వరకూ అందరూ ప్రజల చేత ఎన్నికై లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ప్రియాంక రాజ్యసభ ఎంట్రీతో కొత్త రాజకీయం కాంగ్రెస్ లో మొదలు కాబోతోంది. ప్రియాంక అయినా కాంగ్రెస్ ను ఒడ్డున పడేస్తుందో చూడాలి మరీ..