ఆస్పత్రుల క్రిమినల్ మెండ్.. ఇన్స్యూరెన్స్ వర్తించదంటూ డ్రామాలు!
డబ్బులకు అలవాటు పడిన కార్పొరేట్ ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. వివిధ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇచ్చిన హెల్త్‌కార్డులు వర్తించవంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నాయి. డబ్బులు కడితేనే ఆస్పత్రిలో చేర్చకుంటామంటూ పేచీ పెడుతున్నాయి. ఇటువంటి ఆస్పత్రులను కోర్టుకు లాగాలంటూ సూచిస్తున్నారు న్యాయవాదులు.. ఇన్స్యూరెన్స్ తీసుకున్న లబ్ధిదారుడికి ఉచిత వైద్యం పొందే హక్కు ఉంటుందని లాయర్లు స్పష్టం చేస్తున్నారు. ఒకవైళ ఏదైనా కార్పొరేట్ దవాఖాన ఇన్స్యూరెన్స్ వర్తించదని చెబితే వారిపై వినియోగదారుల కోర్టులో కేసు వేయవచ్చని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి ఆరోగ్యబీమా ఉంది. కాగా ఇటీవల అతడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు.
బీమాసంస్థకు సమాచారం కూడా ఇచ్చాడు. కానీ ఆస్పత్రి మాత్రం అతడికి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ముందుగా రూ. 25వేలు కడితేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో ఆ డబ్బు చెల్లించాడు. అయితే చివరకు ఆస్పత్రివారు అతడికి 4,23,000 బిల్లు వెశారు. ఆ డబ్బులు కడితే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. తర్వాత అతడి నుంచి చెక్కుల రూపంలో బిల్లులు తీసుకొని డిశ్చార్జి చేశారు. తర్వాత ఆ బిల్లు ను ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. చివరకు తనకు డబ్బు వస్తుందో రాదో తెలియక అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇటువంటి ఘటనలు హైదరాబాద్‌లో నిత్యం కోకొల్లలు.
అయితే ఇన్స్యూరెన్స్ తీసుకొనే వారికి ఎటువంటి న్యాయపరమైన హక్కులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బీమా సంస్థ పరిధిలో ఉన్న ఏ నెట్‌వర్క్ హాస్పిటల్లో అయినా బీమాను పొందే హక్కు వినియోగదారునికి ఉంటుందని దిల్లీ హైకోర్టు లాయర్ అంబికా రే వివరించారు. ఒకవేళ ఏ ఆస్పత్రి అయినా.. ఏ కారణం చేతనైనా క్యాష్‌లెస్ వైద్యం చేయకపోతే.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం (కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆక్ట్) - 2019 లోని 10, 11, 12 సెక్షన్ల ప్రకారం బాధిత వ్యక్తి కన్స్యూమర్ కోర్టులో కేసు నమోదు చేయవచ్చు. అయితే సదరు వినియోగదారుడు బీమా సంస్థకు తాను ఏ ఆస్పత్రిలో చేరినది బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇన్స్యూరెన్స్ పాలసీలో ఉన్న నియమనిబంధనలను అనుసరించి ఆస్పత్రి వైద్యం చేయకపోతే కచ్చితంగా అది క్రిమినల్ కేసు అవుతుందని వివరించారు.
రోగి ప్రాణం నిలబెట్టడానికి ప్రాథమిక చికిత్స అందించడం ఆస్పత్రుల ప్రథమ కర్తవ్యం. ఒక వేళ వారు చికిత్స అందించలేని పక్షంలో ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత మాత్రమే వేరే ఆసుపత్రికి తరలించాలని చెప్పాలి కానీ, ప్రథమ చికిత్స అందించకుండా రోగికి చికిత్స అందించబోమని చెప్పడం నేరమే.. వైద్యం అందించిన హాస్పిటల్ మీద, సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీ మీద కేసు పెట్టవచ్చు. కేసులో బలం ఉంటే వినియోగదారుల కోర్టు.. ఆస్పత్రికి , సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి జరిమాన విధించవచ్చు. అతడి వైద్యానికి అయిన ఖర్చుతో పాటు మరింత అధికంగా కూడా పరిహారం పొందే అవకాశం ఉంటుంది.