టెర్రరిస్టుల లిస్టులో ఆరెస్సెస్ చీఫ్ పేరు?

Update: 2017-07-15 06:21 GMT
మోహన్ భగవత్... దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీకి మూలమైన ఆరెస్సెస్ అధినేత. దేశ అత్యున్నత పదవి కూడా చేపడతారని ఒక దశలో ప్రచారం జరిగింది. అలాంటి వ్యక్తిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిఘా సంస్థలపై ఒత్తిడి తెచ్చిందట. షాక్ తింటున్నారా... ఆరెస్సెస్ చీఫ్ ను ఎందుకలా చేరుస్తారనుకుంటున్నారా... ఇది ఇప్పటి మాట కాదు, యూపీయే ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రయత్నమట. తాజాగా అప్పటి పరిణామాలపై నేషనల్ చానళ్లలో కథనాలు రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇది చర్చేనీయమైంది.
    
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాల్సిందిగా నిఘా సంస్థలపై మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ-2 సర్కార్ ఒత్తిడి తీసుకువచ్చిందట. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ విషయం వెలుగులోనికి రావడంతో వర్షాకాల సమావేశాలలో వేడి - వాడి వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
    
అజ్మీర్ - మాలెగావ్ పేలుళ్ల తరువాత అప్పటి యూపీఏ ప్రభుత్వం హిందూ ఉగ్రవాద కార్యకలాపాలలో మోహన్ భగవత్ పాత్రపై ఆధారాల కోసం ప్రయత్నించిందట. అజ్మీర్ - మాలెగావ్ పేలుళ్ల అనంతరం తొలిసారిగా యూపీఏ సర్కార్ హిందూ ఉగ్రవాదం అన్న పదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ హిందూ ఉగ్ర కార్యకలాపాలలో మోహన్ భగవత్ ను ఇరికించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రచారమవుతోంది. అజ్మీర్ - మాలెగావ్ పేలుళ్లకు పాల్పడిన హిందూ ఉగ్ర సంస్థ అభినవ్ భరత్ కు మోహన్ భగవత్ ప్రోత్సాహం, సహకారం అందించారన్నదిశగా దర్యాప్తు జరపాలని, అందుకు అవసరమైతే ఆయనను కస్టడీలోనికి తీసుకోవాలని అప్పటి హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సహా పలువురు యూపీఏ మంత్రులు నేరుగా ఎన్ ఐఎకు ఆదేశాలిచ్చారని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Tags:    

Similar News