సీఎం క్యాంపు కార్యాల‌యానికి చేరిన ప్ర‌త్యూష‌

Update: 2015-07-29 12:16 GMT
సవతితల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషను తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసానికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష వివరాలు బయట పెట్టవద్దని మీడియాను సూచించింది. కొద్ది రోజుల క్రితం ప్రత్యూషను హాస్పిటల్ లో స్వయంగా పరామర్శించిన సీఎం కేసీఆర్ ఆమెను కన్నకూతురిలా చూసుకుంటానని, ఆమెకు చదువు చెప్పించి, పెళ్ళి చేయిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, పూర్తిగా కోలుకున్న ప్రత్యూషను ఎల్బీనగర్ లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జి అయింది. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రత్యూషను హాజరుపరిచారు.

ఈ సందర్భంగా   తల్లిదండ్రులు తనకు నరకం చూపారని వారితో కలిసి ఉండేది లేదని మీడియా ముందు చెప్పింది.  ప్రత్యూష తాను నర్సింగ్ కోర్సు చేస్తానని, పేదల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది. అయితే బంధువుల ఇళ్ళకు వెళ్ళబోనని, హాస్టల్ లో ఉండి చదువుకుంటానని ప్రత్యూష చెప్పింది. ప్రత్యూషతో సుమారు 25 నిమిషాల పాటు మాట్లాడిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమె విషయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరును అభినందించారు.
Tags:    

Similar News