చికెన్ ధర ఎందుకంత మండిపోతోంది?
మీకు పుణ్యం ఉంటుంది నాయనా.. ఈ కోళ్లను తీసుకెళ్లండి. వీటికి తిండి పెట్టలేక చస్తున్నాం. మీరు తీసుకెళ్లి ఎంచక్కా వండుకొని తినేయండంటూ మార్చిలో ఫౌల్ట్రీ యజమానులు బ్రతిమిలాడుకోవటం తెలిసిందే. కోడి ఒక్కొక్కటి రూ.30 నుంచి రూ.50కు అమ్మినా కొన్నిచోట్ల అమ్ముడు కాని దుస్థితి. దీంతో.. చాలా చోట్ల ఫ్రీగా పంచేసి చేతులు దులుపుకున్నారు. చికెన్ తింటే మాయదారి రోగం బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుందన్న భయాందోళనతో ఉన్న ప్రజల కారణంగా అలాంటి పరిస్థితి.
తర్వాతి కాలంలో చికెన్.. మటన్ లాంటివి తింటేనే మంచిదన్న నిపుణుల మాట నెమ్మదిగా మనసులకు ఎక్కించుకున్నారు. వారాలు కాస్తా నెలలుగా మారి.. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు చికెన్ ను భారీగా లాగించేస్తున్నారు. దీంతో.. చికెన్ డిమాండ్ అనూహ్యంగా పెరిగి పోవటంతో.. ఇంతకు ముందెప్పుడూ లేని రీతిలో భారీ ఎత్తున ధరలు పలుకుతున్నాయి. కిలో చికెన్ రూ.300 నుంచి రూ.310 వరకు పలుకుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతభారీగా ధరలున్నా.. వినియోగదారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. చికెన్ వినియోగం ఎంత భారీగా పెరిగిందన్న విషయానికి ఉదాహరణగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోని గణాంకాల్ని ప్రస్తావించాల్సిందే. విడి రోజుల్లో సగటున 7.5 లక్షల నుంచి రూ.8 లక్షల కేజీల వరకూ చికెన్ అమ్మకాలు ఉంటాయి. అలాంటిది తాజాగా అందుకు మూడు రెట్లు ఎక్కువగా ఆదివారం అమ్మకాలు సాగినట్లుగా చెబుతున్నారు.
వినియోగం పెరిగితే.. ధర అంతలా పెరిగిపోతుందా? అంటే.. దానికి కారణం వేరే ఉంది. మార్చిలో పెద్ద ఎత్తున సాగిన నెగిటివ్ ప్రచారంతో కోళ్లను ఒక్కసారిగా వదిలించుకున్నారు ఫ్రౌల్టీ యజమానులు. అంతేకాదు.. కోళ్ల ఉత్పత్తిని ఆపేశారు. దీంతో.. కోళ్ల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. తర్వాత.. చికెన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న మాట నిపుణుల నోట రావటంతో నెమ్మదిగా చికెన్ తినటం మొదలు పెట్టారు. ప్రజల అలవాట్లు.. అభిరుచులు వేగంగా మారిపోవచ్చు. కానీ.. అందుకు తగ్గట్లు ఉత్పత్తి ఉండదు కదా. ప్రస్తుతం అలాంటి సంధి దశలో మార్కెట్ ఉంది.
కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్న వేళలోనే చికెన్ వినియోగం భారీగా పెరిగిపోవటంతో ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడు ఫౌల్ట్రీ యజమానులు కోళ్ల ఉత్పత్తిని షురూ చేశారు. అవన్నీ మార్కెట్లోకి వచ్చేసరికి కనీసం మూడు.. నాలుగువారాల సమయం పడుతుంది. అప్పటికి కానీ చికెన్ ధర ఒక కొలిక్కి వచ్చే వీలుందని చెబుతున్నారు. అప్పటి వరకూ చికెన్ ధరలు మండి పోవటం ఖాయమనే చెప్పాలి.