ఢిల్లీ మెట్రో రక్షణ కోసం పోలో కుక్కకు పోస్టింగ్.. దాని ప్రత్యేకత ఏమంటే?
ఢిల్లీ మెట్రో భద్రత కోసం శిక్షణ పొందిన ఒక కుక్కకు తొలి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన కుక్కలకు దీనికో తేడా ఉంది. తాజాగా పోస్టింగ్ లభించిన ఈ కుక్క (పోలో) ఇకపై విధులు నిర్వర్తించనుంది. కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం సిబ్బందితో కలిసి పని చేసే ఈ కుక్కకు బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు.
చురుకైన బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన ఈ కుక్కను.. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టే ఆపరేషన్లోను వినియోగించారు. చురుకైన ఈ కుక్కకు వాసన పసిగట్టటం.. దాడి చేయటం.. కాపలా కాయటం లాంటివి విధుల్ని సమర్థంగా నిర్వహిస్తుందని చెబుతారు. అంతేకాదు.. ఈ కుక్క ప్రత్యేకత ఏమంటే.. ఏకధాటిగా నలభై కిలోమీటర్లు నడిచే సామర్థ్యం దీని సొంతం.
సాధారణంగా అందరు వాడే జర్మన్ షెపర్డ్.. లాబ్రడార్ లాంటి కుక్కలు ఏమైనా సరే నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే నడుస్తాయని.. ఒక టాస్కు మాత్రమే చేస్తాయి. కానీ.. బెల్జియం మాలినోయిన్ పోలో మాత్రం ఏకంగా మూడు పనుల్ని ఏకకాలంలో చేయటం దీని ప్రత్యేకత.