భర్త పంచె కట్టు నచ్చట్లేదని విడాకులు... బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..!

ఇటీవల కాలంలో విడాకులు తీసుకోవడం చాలా చిన్న విషయంగా మారిపోయిందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-11 11:30 GMT

ఇటీవల కాలంలో విడాకులు తీసుకోవడం చాలా చిన్న విషయంగా మారిపోయిందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతీ చిన్న సమస్యకు విడాకులే పరిష్కారం అనుకునే జనాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది! దీనికి కారణం దాంపత్య జీవితం విలువ తెలియకపోవడమా.. లేక, ఆప్షన్స్ ఎక్కువగా ఉండటమా.. అదీగాక, సమస్య నిజంగానే తీవ్రమైనదిగా ఉండటమా అనేది సదరు వ్యక్తికే తెలియాలని అంటుంటారు!

పైగా ఇటీవల పలు కేసులో విడాకులకు పలువురు చెబుతున్న కారణాలు.. నవ్వాలో, ఏడవాలో తెలియని స్థితిని కల్పిస్తున్నాయనే కామెంట్లనూ సొంతం చేసుకుంటున్న పరిస్థితి! ఈ సమయంలో తనను చదివించి ఎస్సై ని చేసి, తన లక్ష్యాన్ని సాధించడంలో అన్ని విధాలా సహకరించిన భర్త నుంచి విడాకులు కోరుతోంది భార్య. ఇంతకూ అందుకు ఆమె చెప్పిన కారణం.. భర్త పంచె కట్టుకుంటున్నాడని, తల వెనుక పిలక ఉంచుకున్నాడనట!

అవును... భోపాల్ కు చెందిన ఓ యువతి వివాహ సమయంలో తనకు సబ్-ఇనిస్పెక్టర్ కావాలని ఉందని తనకు కాబోయే భర్తకు చెప్పిందంట. దీంతో.. తన కోరిక ఒకటి, భార్య కోరిక మరొకటా అని భావించాడో ఏమో కానీ.. భార్య కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్న భర్త ఆమె, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలా సహకరించాడు. ఫలితంగా.. ఆమె ఎస్సై అయిపోయింది. కట్ చేస్తే... ఇప్పుడు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది!

ఈ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్ లో... తన భర్త ధోతీ-కుర్తా ధరిస్తాడని.. అది తనకు ఇష్టం ఉండదని.. అతను పిలక కూడా ఉంచుకుంటాడని.. అది తనకు అస్సలు ఇష్టం ఉండదని.. ఈ విషయాన్ని తాను పదే పదే చెప్పినప్పటికీ అతను ఏమాత్రం వినిపించుకోవడం లేదని.. ఇదే క్రమంలో తన పూజారి విధులను వదులుకోవడానికి నిరాకరిస్తూనే ఉన్నాడని.. ఇది తన హోదాకు అవమానంగా ఉందని.. అందుకే తనకు విడాకులు కావాలని ఆమె పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన ఫ్యామిలీ కోర్టు న్యాయవాది అయిన పరిహార్.. భార్యాభర్తల మధ్య ఇటువంటి విడాకుల కేసులు తరచుగా వస్తుంటాయని.. కేసు కోర్టుకు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ కూడా అందిస్తుందని.. ఈ క్రమంలో కొన్నిసార్లు దంపతులు అంగీకరించి, అండర్ స్టాండింగ్ కి వస్తారని.. మరికొన్ని సందర్భాల్లో విభేదిస్తారని.. ఈ విషయాన్ని పరిశీలించి న్యాయమూర్తి విడాకుల నిర్ణయం తీసుకుంటారని తెలిపారు!

దీనిపైనా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అతను కష్టపడినప్పుడు, సహకరించినప్పుడు ఆ పౌరోహిత్యం, ఆ పంచె, పిలక అడ్డు రాలేదు కానీ.. ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తేలేసినట్లు ప్రవర్తించడం సరైంది కాదు అని ఒకరంటే... తన భార్య లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన వ్యక్తి.. మారిన కాలానికి అనుగుణంగా కోరిన ఆమె విన్నపాన్ని మాత్రం ఎందుకు మన్నించకూడదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!!

Tags:    

Similar News