పువ్వాడ గాలితీసిన పొంగులేటి
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్‌కుమార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూముల ఆక్రమణకు తెగబడ్డారని ఆరోపించారు. తన అనుచరులతో మంత్రి దౌర్జన్యాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఆయన ఆగడాలతో ఖమ్మంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులే లేకుండా పోయాయని అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పొంగులేటి ఈ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంత పెద్ద వ్యక్తులు పోటీకి వచ్చినా ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొన్నటివరకు బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆ తరువాత పొంగులేటి ఏ పార్టీలోనూ చేరలేదు.
ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఒక థలో కాంగ్రెస్, బిజెపిలు విశ్వప్రయత్నాలు చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ బృందం, బిజెపి తరపున ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పొంగులేటితో సంప్రదింపులు జరిపారు. అయినా తాను ఏ పార్టీలో చేరే విషయం గురించి పొంగులేటి క్లారిటీ ఇవ్వలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన 'చేయి'వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పొంగులేటి చేసే కామెంట్స్ వార్తల్లో ప్రధాన శీర్షికలో నిలుస్తాయి.
ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అధికార మదంతో మంత్రి పువ్వాడ తన సభలను అడ్డుకునే ప్రయత్నం సభలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు మనుషులంటే గౌరవమే లేదని అన్నారు.
మంత్రి పువ్వాడను ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తలచుకుంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఇంట్లో కూర్చోవాల్సిందేనని పేర్కొన్నారు. పువ్వాడపై తాను పోటీ చేయడం కాదని, బచ్చాగాడినైనా పెట్టి గెలిపిస్తానంటూ పొంగులేటి విరుచుకుపడ్డారు.
ఇక కేసిఆర్ ప్రభుత్వంపై కూడా పొంగులేటి తన స్టయిల్‌లో నిప్పులు చెరిగారు. కేసిఆర్ గారెడీ మాటలతో ప్రజలను మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈ సారి కూడా మళ్లీ మాయమాటలతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కేసిఆర్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. రైతులకు మేలు చేసే పథకాలన్నీ రద్దు చేసిన కేసిఆర్ ఒక్క రైతుబంధు అందించి గొప్ప పని చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు. సిఎంకు స్వంత ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టారని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆఆరోపించారు