మరి పొట్టి శ్రీరాములుగారి మాటేంటి? : పవన్‌కు కేటీఆర్ కౌంటర్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కౌంటర్ ఇచ్చారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ చేసిన ప్రాంతీయ వాదం.. ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ``మరి పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ నుండి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా?`` అని కేటీఆర్ ప్రశ్నించారు.
అంతేకాదు.. ఏది ప్రాంతీయ వాదం? అని కేటీఆర్ నిలదీశారు. జాతీయ వాదం ముసుగులో ప్రాంతీయ ఆర్థిక అరాచకం సృష్టించడం కరెక్టా? అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులను ప్రధాన మంత్రి మోడీ గుజరాత్‌కు పట్టుకుపోతున్నారని.. జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కాదా ఇది.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కరెక్టేనా ? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ``మోడీ గారు కేవలం గుజరాత్‌కి పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా పవన్ కళ్యాణ్`` అని వ్యాఖ్యానించారు.
ముమ్మాటికీ..
తెలంగాణ మీ అయ్య జాగీరా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైనా కేటీఆర్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ముమ్మాటికీ.. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల జాగీరేనని చెప్పారు. అనేక బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం నాలుగు కోట్ల మంది జాగీరేనని చెప్పారు. ఈ నేల వందల మంది రక్తంతో తడిచిందని.. ఎంతో మంది శ్రమ దానంతో ఏర్పడిందని తెలిపారు. కాబట్టి.. ఇది ముమ్మాటికీ.. తెలంగాణ ప్రజల జాగీరేనని చెప్పారు. అయితే.. ఏపీ వాళ్లు ఇక్కడకు రావచ్చని, నివసించవచ్చని చెప్పారు. ``మీ కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మేం వద్దన్నమా?`` అని ప్రశ్నించారు.