ఈసీ కీలుబొమ్మే.. మోడీ నిరూపించాడు..
దేశంలో స్వతంత్ర వ్యవస్థలు నిక్కచ్చిగా.. నిజాయితీగా.. రాజకీయ పార్టీల రాగద్వేషాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎన్నోసార్లు నిరూపితమైంది. కానీ దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం.. మోడీ గుప్పిట పాలన మొదలయ్యాక మన స్వత్రంత రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడం మొదలుపెట్టాయి. ఆర్బీఐ, ఈడీ, ఐటీ ఇలా స్వతంత్ర వ్యవస్థలన్నీ మోడీ పాదాక్రాంతమయ్యాయి. మాట వినని వాటి అధిపతులను సామధాన బేధ దండోపాయాలు ప్రయోగించి మన మోడీగారు తన వంశం చేసుకున్నారన్న వాస్తవం మనకూ ఎన్నో సార్లు నిరూపితమైంది.
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ కూడా ఎన్నికల కమిషన్ పాత్రపై అందిరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. మోడీకి, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించడంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నికల వేళ తమకు గిట్టని పార్టీల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ఐటీ, ఈడీ దాడులు చేయడం.. ఈసీ ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శల పాలవుతోంది. ఈసీ మోడీ చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇప్పుడు తాజా ఘటన కూడా మోడీపై ఈసీకి ఎంత అవాజ్య ప్రేమ ఉందో తేటతెల్లమైంది. మహారాష్ట్రలోని లాతూర్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ కోడ్ ఉల్లంఘించారు. పుల్వామా అమరవీరులు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సైనికులకు తమ ఓటును అంకితమివ్వాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కోల్ కతా కు చెందిన మహేంద్ర సింగ్ అనే వ్యక్తి మోడీపై ఏప్రిల్ 9న ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై వచ్చిన ఈ ఫిర్యాదును ఈసీ తన వెబ్ సైట్ లో పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన కింద ఇప్పటివరకూ వచ్చిన మొత్తం 426 ఫిర్యాదులను కూడా అందులో చూపించింది.
అయితే అనూహ్యంగా మోడీపై వచ్చిన ఫిర్యాదు ను ఈసీ తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరణ రాకముందే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం.. మోడీకి అనుకూలంగా తొలగించడం వివాదాస్పదమైంది. దీనిపై ఫిర్యాదు దారు మహేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసీ నాలుక కరుచుకుంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి తప్పించుకుంది. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. అయితే రెండు వారాలు గడిచినా ఈసీ స్పందించకపోవడంపై ఫిర్యాదు దారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈసీ సూచించినా కూడా మోడీ భారత సైనికుల త్యాగాలను ప్రచారంలో వాడుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందే ఎత్తుగడ వేస్తూనే ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఎంత మంది నిరసన తెలుపుతున్నా తన పంథా వీడడం లేదు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ మోడీ జేబులో కీలు బొమ్మగా మారిన వేళ దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ కాక ఏమవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.