మీరే రాజీనామాలు చేయచ్చు కదా ?
'దొంగ ఓట్లు వేయించుకుని బద్వేలులో గెలవటం కూడా ఓ గెలుపేనా' .. టీడీపీ
'రాష్ట్రంలో 81 శాతం జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు'..రఘురామ
పై రెండు స్టేట్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కసుతో చేస్తున్నవే. తెలుగుదేశంపార్టీ నేత బుద్ధావెంకన్న మీడియాతో మాట్లాడుతు బద్వేలులో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందన్నారు. ప్రజల్లో వైసీపీకి అంతటి ఆదరాభిమానాలున్నాయని జగన్మోహన్ రెడ్డి నిజంగానే భావిస్తుంటే వెంటనే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని బుద్ధా సవాలు విసిరారు. గతంలోనే చంద్రబాబునాయుడుతో పాటు అనేకమంది సీనియర్లు ఇలాంటి రాజీనామా సవాళ్ళు చాలానే చేశారు.
టీడీపీ చేసిన రాజీనామా సవాళ్ళకు అప్పట్లోనే మంత్రులు, వైసీపీ నేతలు గట్టి రిప్లయ్యే ఇచ్చారు. కానీ అదే సవాలును టీడీపీ కావాలనే చేస్తోందని అనుకుని వైసీపీ స్పందించటం మానేసింది. నిజానికి వైసీపీ ఎంఎల్ఏలను రాజీనామాలు చేయమని సవాలు విసిరేబదులు తమ ఎంఎల్ఏలతోనే చంద్రబాబు రాజీనామాలు చేయించచ్చు. పిరికితనంతోనో లేకపోతే మళ్ళీ గెలవలేమనే భయంతోనే వైసీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటం లేదనే అనుకుందాం కాసేపు.
మరి తమ్ముళ్ళలో నిజంగానే ధైర్యముంటే తామే ఎందుకు రాజీనామాలు చేయకూడదు. తాము రాజీనామాలు చేసి ఉపఎన్నికలో మళ్ళీ అందరు గెలిచి జగన్ కు బుద్ధిచెప్పచ్చు కదా. ఉపఎన్నికలో గెలవటం ద్వారా జగన్ కు జనాల్లో బలం లేదని నిరూపించవచ్చు కదా. మరంతటి బంగారంలాంటి అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదిలేసుకుంటున్నారు ? ఊరికినే మీడియాలో రాజీనామాల సవాళ్ళు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని టీడీపీ నేతలకు ఎందుకు అర్ధం కావటంలేదో.
ఎవరికి ప్రజాబలం ఉందో ? ఎవరికి లేదో అర్జంటుగా తెలుసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే టీడీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేసేస్తే ప్రజాబలం విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. ఇక వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే మాటంటున్నారు. జగన్ పై 81 శాతం జనాల్లో తీవ్రమైన అసృంతృప్తి ఉందట. ఇదికూడా నిజమే అనుకుందాం కాసేపు. జనాల్లో జగన్ ప్రభుత్వంపై అంత అసంతృప్తి ఉన్నదే నిజమైతే తాను వెంటనే నరసాపురం ఎంపీగా రాజీనామా చేసేయచ్చు.
రాజీనామా కారణంగా ఉపఎన్నిక వచ్చినపుడు తిరిగి తాను పోటీచేస్తే జనాలు మంచి మెజారిటితో గెలిపిస్తారు కదా. ఆమధ్య కూడా తన నియోజకవర్గంలో సర్వే చేసినపుడు జగన్ కన్నా తనకే ప్రజా మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. తన గెలుపు మీద, తన నియోజకవర్గంలోని జనాల మీద రాజుగారికి అంత నమ్మకం ఉన్నపుడు వెంటనే రాజీనామా చేసేయచ్చు కదా ఎవరు వద్దన్నారు ? రఘురామ కూడా తెలంగాణాలో ఈటల రాజేందర్ నే ఆదర్శంగా తీసుకుంటే జనాధరణ ఎవరికుందో అర్జంటుగా తేలిపోతుంది.