లంచాల వ్యవహారం..దొరికిపోయిన టీడీపీ ?

Update: 2019-02-12 08:13 GMT
టీడీపీ నేతలు స్కెచ్చేశారు.. అధికార పార్టీ కదా అని ఏపీ పోలీసులు కొందరు సై అన్నారు. వైసీపీ నేతలు లంచాలు ఇచ్చినట్టు డ్రామాలాడారు.. చివరకు పావులుగా మారిన ఇద్దరు ఎస్పైల బాగోతం విచారణలో బయటపడడంతో ఇప్పుడు వారిద్దరూ వీఆర్ లోకి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ నేతలు ఆడుమన్నట్టు ఆడిన పోలీసులు, వారితో పోలీస్ వ్యవస్థపై పెద్ద మచ్చపడినట్టైంది.

ఎన్నికల సమయంలో సహకరించాల్సిందిగా కోరుతూ స్థానిక పోలీసులకు మైలవరం నియోజకవర్గంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లంచాలు ఇచ్చినట్టు పోలీసులు ఆరోపించి స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం పరిధిలోని ఎస్ ఐలు అస్బక్, శ్రీనివాసులు ఇద్దరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై ఈ కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించిన జిల్లా ఎస్పీ త్రిపాఠి అంతర్గత విచారణ జరిపారు. ఇందులో అంతా రాజకీయ ప్రేరేపితం అని తెలుసుకొని.. టీడీపీ నేతల సూచనల మేరకే సదురు ఎస్ ఐలు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని తేలింది.  దీంతో ఆ ఇద్దరు ఎస్ ఐలను వీఆర్ కు పంపిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ నేతలపై టీడీపీ, పచ్చమీడియా  చేసిన ప్రచారం తప్పుడు అని రుజువు అయ్యింది. ఏపీలో పోలీసులు టీడీపీ నేతల చెప్పు చేతల్లో ఉన్నారని ఇటీవలే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెల్లినప్పుడు  కేంద్ర మంత్రులకు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో పోలీసుల సాయంతో అక్రమాలు చేసి గెలవాలని చూస్తున్నారని జగన్ ఫిర్యాదు చేశారు.

మైలవరం వ్యవహారంలో పోలీసుల పాత్ర  బయటపడడంతో వైసీపీ విమర్శలకు బలం చేకూరింది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ టీడీపీ ఎలా ఉపయోగించుకుంటోదన్న భయం ప్రతిపక్షాల్లో గుబులు రేపుతోంది. ఈసీ దీనిపై నిఘా పెట్టాలని కోరుతున్నాయి.
Tags:    

Similar News