రికార్డుల నిర్మలమ్మ...బడ్జెట్ సీతారామమ్మ !

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆమె 2014 నుంచి నరేంద్ర మోడీ కేబినెట్ లో పనిచేస్తూ వస్తున్నారు.;

Update: 2026-01-28 00:30 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆమె 2014 నుంచి నరేంద్ర మోడీ కేబినెట్ లో పనిచేస్తూ వస్తున్నారు. ఆమె ఇందిరాగాంధీ తర్వాత రెండవ మహిళా రక్షణ మంత్రిగా పనిచేసిన కీర్తిని దక్కించుకున్నారు. రక్షణ మంత్రిగా జలాంతర్గాములలో ప్రయాణించి సాహసానికి మారు పేరుగా నిలిచారు. ఇక 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు ఆమె శాఖను మార్చి దేశానికే ఆర్ధిక వ్యవహారాలు చూసే కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ విధంగా నిర్మలా సీతారామన్ నాటి నుంచి నేటి వరకూ వరసగా ఎనిమిది బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ తో కలుపుకుంటే ఆమె తొమ్మిదవ బడ్జెట్ తో రికార్డు క్రియేట్ చేశారు.

ఆమెకు ఆమెనే సాటి :

ఈ రికార్డ్ ఏంటి అంటే ఒకే ప్రభుత్వంలో వరసగా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టడం. నిజానికి తొమ్మిది బడ్జెట్లు దేశంలో ప్రవేశపెట్టిన వారు లేరా అంటే దిగ్గజ నేత పి చిదంబరం ఉన్నారు. కానీ ఆయన వరసగా తొమ్మిది బడ్జెట్లు ప్రవేశ పెట్టలేదు, వేరు వేరు ప్రభుత్వాలలో ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అలా గ్యాప్ తీసుకుని ఆయన తొమ్మిది బడ్జెట్లు దేశానికి ఇచ్చారు అన్న మాట. దాంతో నిర్మలమ్మనే ఈ విషయంలో గ్రేట్ అని అంటున్నారు. ప్రభుత్వం మారలేదు, ఒకే ప్రధాని నాయకత్వంలో ఆమె వరసగా బడ్జెట్లు ఇన్ని దేశానికి అందించారు అన్న మాట.

ఒక్క అడుగు దూరంలో :

మరో వైపు చూస్తే ఈ దేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కి తిరుగులేని రికార్డు ఉంది. ఆయన కూడా 1957 నుంచి 1969 మధ్యలో ఈ బడ్జెట్లు అందించారు. కానీ వేరు వేరు ప్రభుత్వాలలో అన్న మాట. సో కంటిన్యూగా ఇచ్చిన ఘనత ఇక్కడ కూడా నిర్మలమ్మదే. ఇక నిర్మలా సీతారామన్ ఇప్పటికే తొమ్మిది బడ్జెట్లతో రికార్డు సాధించారు. వచ్చే ఏడాది ఆమె 10వ బడ్జెట్ ప్రవేశపెడితే మొరార్జీ దేశాయ్ రికార్డు సమం చేస్తారు, 2028 తో ఆమె మొరార్జీ దేశాయ్ నే అధిగమిస్తారు, 2029లో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ తో కలుపుకుంటే డజన్ బడ్జెట్లు దేశానికి అందించిన ఆర్ధిక మంత్రిగా మహిళా నేతగా నిర్మలమ్మ రికార్డుని సమీప భవిష్యత్తులో ఎవరూ దాటి వెళ్ళలేరు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నిర్మలమ్మ బడ్జెట్ విషయంలో సరికొత్త రికార్డుతో తనదైన చరిత్రను సృష్టించారు అని అంటున్నారు.

Tags:    

Similar News