జగన్ ని ఏమీ చేయలేక...చేతగాక...మాజీ ఐపీఎస్ సెన్సేషన్ !

ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున చక్రం తిప్పారు అని ఆరోపణలు ఉన్నాయి.;

Update: 2026-05-02 18:05 GMT

ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున చక్రం తిప్పారు అని ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘు రామ క్రిష్ణం రాజు మీద అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టారు అని ఆరోపణలు ఆ వైపు నుంచి ఉన్నాయి. దీంతో అసలు రఘురామకు పీవీ సునీల్ కుమార్ కి ఎక్కడ వివాదం మొదలైంది. అసలు ఎందుకు ఇది అయిదేళ్ళుగా ఎడతెగని తెలుగు టీవీ సీరియల్ గా కొనసాగుతోంది అన్నది కూడా చర్చగానే ఉంది. దీని మీదనే ఒక తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నలు వేసినపుడు పీవీ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ని ఏమీ అనలేక :

నిజానికి రఘురామకు తనకు మధ్యలో ఏమీ లేదని సునీల్ కుమార్ చెప్పారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో బాధితుడు అయినపుడు రాజకీయ నాయకుడిగా ఆయన పంతం సాధించాల్సింది పోరాడాల్సింది జగన్ మీదనే అని పీవీ సునీల్ కుమార్ తేల్చేశారు. కానీ ఇక్కడ రఘురామ మాత్రం తనను ఎంచుకున్నారని అన్నారు. దానికి కారణం ఆయనకు జగన్ మీద పోరాడడం చేతకాలేకపోయింది అని అన్నారు. జగన్ ని ఏమీ అనలేకనే తన లాంటి దళితుడి మీద పడ్డారు అని సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. తనను అయితే ఏమైనా చేయవచ్చు అని భావించారు అని కానీ తాను మాత్రం ఊరుకునే వాడిని కాను అని తేల్చుకుంటాను అని సునీల్ కుమార్ చెప్పడం విశేషం. నన్ను ఏదో ఒకటి చేసేయవచ్చు మీసాలు మెలి వేయవచ్చు అని తొడలు కొడుతూ తన జోలికి రఘురామ వచ్చారని అన్నారు. అయితే తానేమీ తేలిగ్గా లొంగే రకాన్ని కానని ఆయన స్పష్టం చేశారు. దేనికీ భయపడను అని తాను ఇక్కడే ఉంటూ పోరాడుతాను అని ఆయన చెప్పారు.

రెండు వర్గాల మధ్య చిచ్చు :

తనకూ రఘురామకు మధ్య వ్యవహారం అయితే రెండు మతాల మధ్య వర్గాల మధ్య చిచ్చు కాదని అన్నారు. అదే సమయంలో కోటి మంది దాకా ఏపీలో ఉన్న దళితుల హక్కుల విషయంలో తాము మాట్లాడుతామని ఆ సందర్భంగా ఆకివీడు రామాలయం లాంటి సంఘటనలు జరిగినప్పుడు తాము ఏది న్యాయం అన్నది కూడా చూసి మాట్లాడుతామని అన్నారు. రఘురామ మీద దాడి చేయడానికిఎవరికీ తాను రెచ్చగొట్టి పంపించింది కూడా లేదని సునీల్ కుమార్ అన్నారు. ఇక తాను హిందూ వ్యతిరేకిని అని ఎవరన్నారు అని ఆయన ప్రశ్నించారు. తాను హిందూ మతంలో అంటరాని తనం గురించే మాట్లాడాను అన్నారు. దేవాలయాల్లో తలుపులు తీసి ఉంటే అంటరాని తనం లేకుండా ఉంటే దళితులు క్రిస్టియన్లుగా మారే వారు కారని ఆయన అన్నారు. సమాజంలో ఈ రోజుకీ ఆర్థిక అసమానతలు దళితులకు ఇతరులకు మధ్య కొత్త అంటరాని తనాన్ని సృష్టించాయని అన్నారు. వీటి మీద పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News