అసద్ అర్థరాత్రి ప్రోగ్రాంకు పోలీసులు నో.. కానీ..

Update: 2020-01-24 05:48 GMT
రిపబ్లిక్ డే కు ముందురోజు అర్థరాత్రి పన్నెండు గంటల వేళలో చార్మినార్ లో జాతీయ జెండా ఎగురవేస్తానని... జాతీయ గీతాన్ని ఆలపిస్తానని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. జనవరి 26 దగ్గరకు వస్తున్న కొద్దీ.. ఈ అంశం హాట్ హాట్ గా మారింది. తాను తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని అసద్ కోరుతుంటే.. మరోవైపు  మజ్లిస్ ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని బీజేపీ  కోరుతున్నారు.

ఇలా పోటాపోటీగా సాగుతున్న ప్రయత్నాల్లో చివరకు పోలీసులు మధ్యే మార్గాన్ని ఎంచుకున్నారు. అసద్ కోరినట్లుగా జనవరి 25 అర్థరాత్రి పన్నెండు గంటలకు చార్మినార్ వద్ద నిర్వహించాలనుకున్న కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు అనుమతిని నిరాకరించారు. అదే సమయంలో.. అసద్ కోరినట్లుగా ర్యాలీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. వేదికను మార్చారు.

చార్మినార్ నుంచి ఖిల్వత్ మైదానికి కార్యక్రమాన్ని మార్చుకోవాలన్న సూచన చేయటం ద్వారా అసద్ కు ఆగ్రహం రాకుండా చూసుకున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు కోరినట్లుగా అసద్ సభకు అనుమతిని నిరాకరించారన్న మాటను నిలబెట్టుకున్నట్లైంది. మొత్తంగా సీఏఏ.. ఎన్ ఆర్సీ .. ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా తలపెట్టిన ర్యాలీ సభల విషయం హైదరాబాద్ పోలీసులు నో చెబుతూనే ఎస్ చెప్పిన వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

    
    
    

Tags:    

Similar News