అసెంబ్లీలో రక్తమొచ్చేలా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి

Update: 2021-03-23 16:30 GMT
దేశంలో అన్ని రాష్ట్రాల్లో మార్షల్స్ ను కొట్టిన ప్రజాప్రతినిధులను చూశాం కానీ.. ప్రజాప్రతినిధులను కొట్టిన మార్షల్స్ ను అస్సలు చూడలేదు. రౌడీల రాజ్యంగా పేరొందిన బీహార్ లో అదిప్పుడు చోటుచేసుకుంది.బీహార్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు సభలోనే దాడి చేయడం కలకలం సృష్టించింది.. ఎమ్మెల్యేలని కూడా చూడకుండా రక్తమొచ్చేలా కొట్టారు.

పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే బిల్లును విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. సభలో ఆందోళనకు దిగారు.పలు మార్లు సభకు అడ్డురావడంతో స్పీకర్ ఆదేశాలతో పోలీసులు, మార్షల్స్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేలను విచక్షణ రహితంగా కొడుతూ బయటకు తోసేశారు.

ప్రజాప్రతినిధులపై అసెంబ్లీలో పోలీసుల దాడిని యావత్ దేశం ఖండించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే చోట ప్రజాప్రతినిధులపై దాడి చేస్తారా? అని అధికార జేడీయూపై విపక్షాలు, ఆర్జేడీ నిప్పులు చెరిగారు. దీనిపై బంద్ కు పలు పార్టీలు అక్కడ పిలుపునిచ్చాయి.
Tags:    

Similar News