అంతరిక్షం అయిపోయింది ...ఇక సముద్ర గర్భమే లక్ష్యం
ఇండియా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో అగ్రస్థానంలో ఉంది. ఊహకందని విజయాలు సాధిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తూ ..ప్రపంచ దేశాలకి పోటీగా నిలుస్తుంది. ఇందులో ఇస్రో పాత్ర ఎంతో కీలకమైంది. గత ఏడాది ఎక్కుపెట్టిన చంద్రయాన్ 2 కొద్దిలో మిస్ అయినప్పటికీ కూడా ఇస్రో పై నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదు. గత దశాబ్ద కాలంలో ఇస్రో సాధించిన విజయాలు అన్ని , ఇన్ని కావు. ఇక ఈ ఏడాది మానవ సహిత ప్రయోగం అయిన గగన్ యాన్ - చంద్రయాన్ 3 వంటి ప్రయోగాలని చేప్పట్టబోతోంది. ఇకపోతే 107వ ఇండియణ సైన్స్ కాంగ్రెస్ సదస్సు లో పాల్గొనడానికి బెంగుళూరికి వచ్చిన పీఎం మోడీ .. ఆ సదస్సు లో మాట్లాడుతూ ..ఇస్రో కీర్తిని - ఘనతని ఆకాశానికెత్తేశారు. వచ్చే రోజుల్లో మరిన్ని విజయాల్ని ఇస్రో అందుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ దశాబ్దంలోని మొదటి సంవత్సరం తొలి వారంలోనే సైన్స్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అది కూడా ఇన్నోవేషన్లు, సైన్స్ కు కేంద్రంగా ఉందన్న బెంగళూరు నగరంలో గడపడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. పాజిటివ్ ఆలోచనలతో 2020లోకి అడుగుపెట్టిన మనం.. సైన్స్ అండ్ టెక్నాలజీని మరింతగా డెవలప్మెంట్ చేసుకుందామని, ఆ తర్వాత మిగిలిన అంశాలపైనా ఫోకస్ పెంచుదామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆవిష్కరణలకు కేంద్రంగా మన దేశంఎదిగిందని, ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 52కు మెరుగుపడిందని ప్రధాని చెప్పారు. గత 50 ఏండ్లతో పోల్చుకుంటే చివరి ఐదేండ్లు.. టెక్నాలజీ సంబంధిత వ్యాపారాలు - అంకుర సంస్థలు బాగా అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు.
అంతరిక్ష పరిశోధనల్లో గొప్ప విజయాలు సాధించిన మనం.. ఇప్పుడు సముద్రపులోతులపై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. నీటి అడుగున ఉన్న విస్తారమైన ఖనిజ సంపదను - శక్తిని అణ్వేషించి - వాటిని వెలికితీసి మనవాళి మంచి కోసం ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు. ఇండియా అభివృద్ధి.. గ్రామాల అభివృద్ధితోనే ముడిపడి ఉందనిన్న మోదీ.. మూలాల నుంచే ఎదగాలని సూచించారు. గడిచిన ఐదేండ్లలో గ్రామీణాభివృద్ధి కోసం చాలా పాడుపడ్డామని, టెక్నాలజీ సాయంతో నేరుగా రైతులకి ఎంతో మంచి చేశామని చెప్పారు.