వ్యాక్సిన్ వినియోగానికి దేశంలో తొలి అప్లికేషన్ పెట్టిన ఫార్మా దిగ్గజం
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లే. అయితే.. ఏ నెలాఖరకు లేదంటే కొత్త సంవత్సరం తొలినాళ్లలో టీకా వచ్చేట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే బ్రిటన్.. అమెరికా లాంటి దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కంపెనీలు కోరుతున్నాయి. తాజాగా భారత్ లో తొలి అప్లికేషన్ ను పెట్టేసింది ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్.
ఇప్పటికే ఆ కంపెనీ బ్రిటన్.. బహ్రెయిన్ లోనూ అప్లికేషన్లు పెట్టి.. ఆమోదం తీసుకుంది. దేశంలో వ్యాక్సిన్ వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి కంపెనీ ఇదేనని చెబుతున్నారు. అయితే.. టీకా అందరికి అందుబాటులోకి వచ్చేలా కేవలం ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు ఉంటాయని ఫైజర్ వెల్లడించింది.
భారత్ కు అవసరమైన డోసుల్ని వీలైనంత త్వరగా అందించేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటామని సంస్థ వెల్లడించింది. దేశంలో ఇప్పటికే ఐదు వ్యాక్సిన్లు క్లినికల్ టెస్టుల్లో చివరి దశలో ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తో పాటు.. భారత్ బయోటక్ కూడా క్లినికల్ టెస్టుల్లో చివరి దశలో ఉన్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సైతం రెండు.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షురూ చేసింది. మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్ కూడా తమ టీకా తొలి.. రెండో దశ ట్రయల్స్ ను షురూ చేసింది. మొత్తంగా చూస్తే.. కాస్త తేడాతో అన్ని కంపెనీలు తమ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అప్లికేషన్ పెట్టుకున్న ఫైజర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.