సెంచ‌రీ దాటిన పెట్రోలు.. బ్యాట్ - హెల్మెట్‌‌ తో నిరసన

Update: 2021-02-18 12:30 GMT
దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుల‌కు షాకిస్తున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌ల పెరుగుల కార‌ణంగా దేశ వ్యాప్తంగా వ‌రుస‌గా ఎనిమిదో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోయాయి. రోజువారి స‌మీక్ష‌లో భాగంగా లీట‌ర్ పెట్రోల్‌నూ 38పైస‌లు, డీజిల్‌పై 39 పైస‌ల మేర పెంచుతే చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.29 కి చేరగా.. డీజిల్‌ ధర రూ. 79.70 వ‌ద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 95.75, డీజిల్‌ రూ. 86. 72 కి చేరాయి.

 ఇక హైదరాబాద్‌లో పెట్రో ధ‌ర రికార్డు స్థాయికి చేరింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.84గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 86.93కి చేరింది. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 95.55 కాగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 89.02 గా ఉంది. అంత‌ర్జాతీయ ధ‌ర‌లు. విదేశీ మార‌క ధ‌ర‌ల ఆధారంగా దేశీయ చ‌మురు సంస్థ‌లు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజువారీగా స‌వ‌రిస్తుంటాయి.

అయితే.. వ్యాట్, ఇత‌ర ప‌న్నుల‌తో వీటి ధ‌ర‌లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. తొలిసారిగా బోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధ‌ర రూ.100 దాటేసింది. దీంతో.. ఓ వాహ‌న‌దారుడు వినూత్నంగా నిర‌స‌న తెలిపాడు. క్రికెట్‌ లో సెంచ‌రీ త‌రువాత బ్యాట్స్ ‌మెన్ హెల్మెట్ తీసి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే.. ఒక పెట్రోల్ పంప్ వద్ద ఓ వాహానదారుడు ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి 'సెంచరీ' సంకేతమిచ్చాడు.

భార‌త్ ‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా 10వ రోజు కూడా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ రోజు పెట్రోల్‌ పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచ‌డంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.88 కి చేరింది. అలాగే, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.27గా ఉంది.  పది రోజుల్లో పెట్రోల్‌ పై రూ.2.93 పెర‌గ‌గా, డీజిల్‌ పై రూ.3.14 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. హైదరాబాద్ ‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.93.64కి చేర‌గా, డీజిల్‌ ధర రూ.87.52గా ఉంది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.34కు చేర‌గా, డీజిల్‌ ధర రూ.87.32గా ఉంది. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్‌లో లీటర్‌ పెట్రోల్ ఇప్ప‌టికే రూ.100కు చేరింది. ఆ రాష్ట్ర‌ పెట్రోల్‌ డీలర్ల సంఘం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం మిగ‌తా వ‌స్తువుల పెరుగుద‌లపై కూడా ప‌డుతుండ‌డంతో సామాన్యుడికి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేవు.
Tags:    

Similar News