పెరిగిన పెట్రోల్ ధరల దెబ్బకు.. తిండి తగ్గించుకుంటున్నారా?

Update: 2021-02-23 17:30 GMT
లీటరు పెట్రోల్ అరవై.. డెబ్భై మధ్యలో ఉండేది కాస్తా.. ఈ రోజున సెంచరీకి దగ్గరకు వచ్చేసింది. డీజిల్ యాభై.. అరవై మధ్యన ఉండాల్సింది ఈ రోజున తొంభైను టచ్ చేసేసింది. ఇలాంటివేళ.. జీవనశైలిలో వచ్చిన మార్పులేమిటి? సగటుజీవి బడ్జెట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి షాకింగ్ నిజాల్ని వెల్లడించింది.

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా 291 జిల్లాల్లో సర్వేను నిర్వహించింది. పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయంపై వారు లోతుగా అధ్యయనం చేశారు. ఈ సర్వేలో 22వేల మంది పాల్గొన్నారు. ఇందులో బయటకు వచ్చిన కొత్త విషయాలు ఆందోళన కలిగించేలా ఉండటమే కాదు.. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి పెట్రోల్.. డీజిల్ పెంపునకు కోత పెట్టకుంటే కొత్త తిప్పలు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

సర్వేలో వెల్లడైన అంశాలు
-  21 శాతం మంది నిత్యవసరాలపై పెట్టే ఖర్చుకు కోత పెట్టుకున్నారు
-  14 శాతం మంది తమ పొదుపు తగ్గించుకుంటున్నారు
-  51 శాతం మంది ఇతర ఖర్చుల్ని తగ్గించుకొని ఆ డబ్బును పెట్రోల్ కు వాడుతున్నారు
-  సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది రాష్ట్రాలు తమ వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు
-  89 శాతం మంది కేంద్రం వేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
-  కేవలం 8 శాతం మాత్రమే ఇప్పటి పన్నుల విధానం బాగుందని చెబుతున్నారు.
Tags:    

Similar News