పీత కష్టాలు కొని తెచ్చుకునే సుజాత

Update: 2015-09-11 04:48 GMT
ఒకసారి అయితే అనుకోవచ్చు. పదే పదే అదే తప్పును చేయటం ఏపీ మంత్రి పీతల సుజాతకు మాత్రమే చెల్లుతుంది. పదవికి కొత్త కాబట్టి.. తెలీక తప్పు చేసి ఉంటుందని అనుకోవచ్చు. కానీ.. మంత్రి పీతల సుజాత సమస్యల్ని కొని తెచ్చుకోవటంలో ఆమెకు ఆమే సాటి. మంత్రి హోదాలో ఉండి.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకునే అలవాటున్న పీతల సుజాత తాజాగా అలాంటి వివాదాన్నే నెత్తి మీద వేసుకున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆమెకు ఉడతా భక్తిగా ఐసీడీఎస్ అధికారులు మంత్రికి రూ.90వేలతో ఒక బంగారు బహుమతిని రహస్యంగా ఇవ్వటం వివాదంగా మారింది. ప్రభుత్వ వసతి గృహంలో మంత్రిగారిని కలిసిన అధికారులు.. మీడియా కంట పడకుండా తాము ఇవ్వాలని భావించిన బహుమతిని ఇచ్చేందుకు ప్రయత్నించటం.. అది కాస్తా మీడియా కంట పడటంతో మంత్రి సుజాతమ్మ మరోసారి వివాదంలోకి చిక్కుకున్నారు. చూస్తుంటే.. బహుమతుల మీదున్న మోజు.. మంత్రిగారికి మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న వాదన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News