పవన్ మాట : పోటీ చేసే సీటు ఎక్కడంటే...?

Update: 2022-05-22 13:32 GMT
పవన్ కళ్యాణ్. జనసేనాని. ఆయన సినీ రాజకీయ రంగాలలో తనదైన దూకుడు చూపిస్తున్నారు. ఒక వైపు సినిమాల్లో విలన్లను ఫైట్లతో విరగదీస్తున్న ఆయన రాజకీయాల్లో పంచ్ డైలాగులతో ప్రత్యర్ధులతో చెడుగుడు ఆడుకుంటున్నారు. అలాంటి పవన్ చాలా కాలానికి మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాను పిలిపించుకుని ఇష్టాగోష్టి భేటీ నిర్వహించారు.

ఇది రెగ్యులర్ విధానంలో కాకుండా  ఫ్రెండ్స్ మధ్య ఒక సాధారణ  సంభాషణగా జరగడం విశేషం. పవన్ సైతం చాలా సింపుల్ గా వారితో కలసిపోతూ ఏ ఒక్కరు ఏ ప్రశ్న వేసినా నో అనకుండా తనదైన శైలిలో బదులివ్వడం విశేషం. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న ఆలోచనలను నిజాయతీగా పంచుకున్నారు.

ఇక మీడియా మిత్రులు కొన్ని ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగినా పవన్ ఎక్కడా అసహనం తెచ్చుకోకుండా కూల్ గానే బదులివ్వడం విశేషం. ఈ సందర్భంగా పవన్ ఒకే మాట అన్నారు. నా మనసులో ఏముందో అదే బయటకు చెబుతాను అని. అలాగే ఆయన మీడియా ప్రశ్నలకు చెప్పిన జవాబులు నిజాయతీని ప్రతిబింబించాయి.

ఈ సందర్భంగా కొందరు మీడియా మిత్రులు పవన్ని వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని అడిగితే ఆయన ఇప్పటికి అయితే ఇఏమీ అనుకోలేదు అంటూ చెప్పడం విశేషం. ఎక్కడ నుంచి పోటీ అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు అని చెప్పారు. ఒక వేళ తాను కనుక సీటు ఎంపిక చేసుకుంటే ముందు మీడియాకే చెబుతాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అటున్న వైసీపీ వారికి ఇంకా ముందు చెబుతాను అని ఆయన చలోక్తి విసిరారు. నేను పోటీ చేసే సీట్లో నన్ను ఓడించమని సవాల్ కూడా చేస్తున్నాను అని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తమ భావజాలం మేరకే జనసేన స్థాపించాను అని. తన అజెండా ముందు ప్రజలు అని ఆయన్ పేర్కోనడం విశేషం. వారు బాగుండాలి అన్నదే తన ఆలోచన అని కూడా ఆయన వివరించారు.

ఇక తన రాజకీయం అంతా జనం చుట్టూనే తిరుగుతుందని ఆయన అంటూ తన సిద్ధాంతాలను నచ్చి బలంగా  నిలబడిన వారు ఈ రోజుకూ తెలంగాణాలో ఉన్నారు అని చెప్పారు. అందుకే అక్కడ నుంచి పోటీకి రెడీ అవుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు అయితే గోదావరి జిల్లాలతో పాటు, విశాఖ, తిరుపతి ఉన్నాయని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. చూడాలి మరి పవన్ అఫీషియల్ గా ప్రకటించే వరకూ అవన్నీ వట్టిప్రచారాలు మాత్రమే.
Tags:    

Similar News