ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు దిగారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం తక్షణసాయం కింద రూ.10వేలతోపాటు రూ.35వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ చెప్పినట్టుగానే నేడు ఆయన స్వగృహంలో నిరసన దీక్షకు దిగారు. ఉదయం 10గంటల నుంచి పవన్ దీక్షలో పాల్గొన్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
గత రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ ఏపీలో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా అధిక ఆదాయం వస్తుందని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఈక్రమంలోనే బాధితులకు జనసేనాని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోకుంటే ఈనెల 7న నిరసన దీక్ష చేపడుతామని పవన్ నిన్న ప్రకటించారు.
అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ నేరుగా దీక్షకు పూనుకోవడంతో ఆయనకు మద్దతుగా జనసైనికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. పవన్ దీక్షకు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రం చేస్తామంటున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ సర్కార్ కు వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు.