దేశం కోసం ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఇదే

Update: 2016-10-24 13:04 GMT
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త‌న త‌ర్వాతి బ‌హిరంగ స‌భకు రంగం సిద్ధం చేశారు. నవంబర్ 10 న అనంతపురం లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ సాధన కోసం ప్రతి జిల్లాలో పోరాట సభను జనసేన నిర్వహిస్తుందని తిరుపతి బహిరంగ సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను గుర్తు చేసిన‌ జనసేన ఇందులో భాగంగా రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమైన అనంతపురంలో సభ జరపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని వివ‌రించింది.

ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ హోదా వచ్చినట్లయితే ఏటా కరువులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంలో ఉపయోగంగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారని జ‌న‌సేన ప్ర‌క‌ట‌న వివ‌రించింది. స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే నిధులలో ఈ జిల్లాను కరువు నుంచి కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.అందువల్లే ఈ సారి బహిరంగ సభకు అనంతపురం జిల్లాలో నిర్వహించాలని నిశ్చయించినట్లు వివ‌రించారు. ఈ సభ అక్టోబరు మొదటి వారంలో జరపాలని తొలుత నిర్ణయించామని,అయితే దేశ సరిహద్దుల్లో భారతసైన్యం సర్జికల్ దాడులలో నిమగ్నమై ఉన్నందున ఇది తరుణం కాదని - ఈ సభను నవంబరుకు వాయిదా వేశామని పవన్ వెల్లడించారు. ప్రత్యేక హోదా లో పాటు సామజిక సమస్యలపై కూడా పోరాటం కొనసాగుతుందని జనసేనాని స్పష్టం చేసారు.ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు లో గ్రామస్థుల అబిష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా పార్కుపై జనసేన గళం విప్పిన సంగతిని గుర్తుచేశారు. అనంతపురంలో జరుపనున్న సభ సమయం - ప్ర‌దేశాన్ని మరోసారి తెలియచేయనున్న‌ట్లు వివవరించారు. అయితే సభకు అవసరమైన అనుమతుల సాధన - ఏర్పాట్లలో జనసేన నేతలు నిమగ్నమై ఉన్నారని స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News