దేశ రాజధానిలో 'కిడ్నాప్ భూతం
దేశ రాజధానిలో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి కూడా భయపడుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 12 నుంచి 15 మంది పిల్లలు కిడ్నాప్ కు గురవడమే ఇందుకు కారణం. గడిచిన 5 నెలల కాలంలో 1500 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ - సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ కిడ్నాప్ ల సంఖ్య తగ్గడం లేదు..
కిడ్నాప్ అయిన పిల్లల్లో 60 శాతం మంది మాత్రమే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అవుటర్ ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా పిల్లల కిడ్నాప్ లు జరుగుతున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజన్ భగత్ తెలిపారు. నగరానికి వలస వచ్చిన పేద ప్రజల పిల్లలే కిడ్నాప్ లకు గురువుతున్నారన్నారు. కనీసం ఆ పిల్లల ఫొటోలు కూడా తల్లిదండ్రుల వద్ద ఉండడం లేదని, దీంతో వారిని గుర్తించడం కష్టతరమవుతోందన్నారు. ఈ కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేసేందుకు 'పెహచాన్స అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై కనిపించే పిల్లల ఫొటోలను తీసి భద్రపరుస్తున్నారు.
ఇలా కిడ్నాప్ అయిన పిల్లలను పెద్ద నగరాలు - గల్ఫ్ దేశాలకు వెట్టి చాకిరి కోసం అమ్మేస్తున్నారని, బాలికలైతే వ్యభిచార కూపంలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ పిల్లల జాడ కనుగొనేందుకు తమ వంతు సహకారం అందించాలని సోషల్ మీడియా, స్వచ్ఛంద సంస్థలను పోలీసులు కోరుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/